ముస్లిం మతస్తులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ బక్రీద్. ఈ పండుగనే ఈద్-ఉల్-అధా అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు ముస్లిం మతస్తులు అందరూ ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగ అంటేనే త్యాగానికి ప్రతీకగా ముస్లిం మతస్తులు భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో, దాన ధర్మాలతో ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ముస్లిం మతస్తులు ఎంతో పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ ఈ ఏడాది 2021 జూలై 21 బుధవారం దేశ వ్యాప్తంగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఇస్లామిక్ పవిత్ర తీర్థయాత్ర లేదా హజ్ నెల చివరిలో బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం మతస్తులు గొర్రె లేదా మేకను బలి ఇచ్చి వాటిని మూడు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని ఇతరులకు దానం చేయడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా ముస్లిం దానధర్మాలు చేయడానికి కూడా కారణం ఉంది. దేవుడి ఆజ్ఞ మేరకు ప్రవక్త ఇబ్రహీం బలి కావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో దేవుడి ఆత్మ ప్రకారం తన బలికి బదులుగా, గొర్రెలను బలి ఇవ్వమని చెప్పడంతో, ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున గొర్రె లేదా మేకను బలి ఇస్తారు.
ఈ పండుగ రోజు ముస్లిమ్స్ తమ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు పండుగ రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మసీదుకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈరోజు ప్రార్థనల అనంతరం ఎవరి స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలను చేసి సంతోషంగా గడుపుతారు. అదే విధంగా మరణించిన ముస్లిం పెద్దల సమాధి వద్దకు వెళ్లి సమాధి ముందు వారికి ఇష్టమైన ఆహార పదార్థాల నుంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయటం వల్ల వారి ఆత్మ సంతోషిస్తుందని భావిస్తారు. ఈ విధంగా ముస్లిం మతస్తులు బక్రీద్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…