చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు..? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు.. మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వర్గానికి పోయే మాటను కాసేపు పక్కనపెడితే నరక ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణంలో పూర్తిగా వివరించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత కష్టాలతో యమపురి ప్రయాణం సాగుతుంది. హత్యలు, అక్రమాలు, మానభంగాలు, దొంగతనాలు, కరుడుగట్టిన నేరాలు చేసిన వాళ్లు తప్పకుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది.
చనిపోయే సమయం దగ్గర పడుతున్న వేళ సరిగా మాటలు రావు. చావుకి దగ్గరైనా ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా.. ఏం మాట్లాడలేకపోతాడు. శరీరమంతా స్పర్శ నాశనం అయి ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుంది. దివ్యదృష్టి తెరుచుకుని చుట్టు జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారట. ఇంకో క్షణంలో తాను చనిపోతున్నా అని తెలియగానే తన కళ్ల ముందు యమధర్మ రాజు పంపిన యమభటులు కనిపిస్తారట. భయకరమైన రూపంలో కనిపించే యమదూతలను చూడగానే నోరు తడారిపోతుంది.
చనిపోయిన శరీరం నుండి ఆత్మను తీసుకుని యమదూతలు ప్రయాణం ప్రారంభిస్తారు. వైతరణి నది పరివాహక ప్రాంతంలో ఈ ప్రయాణం అత్యంత భయంకరంగా సాగుతూ ఉంటుంది. 47 రోజులు ఆత్మలను చిత్రహింసలకు గురి చేస్తూ ఆత్మలను తమ వెంట తీసుకెళతారు యమదూతలు. ఈ ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి చూసినా యమదూతలు అనుమతించరు. పైగా ఇంకా హింసలకు గురి చేస్తారు. ఇక ఆత్మకు యమభటులు పెట్టే క్షోభ అంతా ఇంత కాదు. యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమదూతలు చాలా భయాందోళనలకు గురిచేస్తారు. నరకంలో యమరాజు చెప్పే తీర్పు గురించి వివరించి వణుకుపుట్టేలా చేస్తారు. ఈ సమయంలో ఆత్మ ఏడవడం మొదలుపెడుతుంది. కానీ.. యమదూతలు జాలి, కరుణ, కనికరం చూపించకుండా మరింత బాధపెడుతూ ఆనందపడుతుంటారు.
యమపురి ప్రయాణంలో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతుంటాయి. కానీ యవభటులు లేపి మరీ కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళతారు. ఎక్కడా ఆగడానికి అవకాశం ఉండదు. ఇక నా వల్ల కాదని మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలు అతి కిరాతకంగా చర్నకోలాల్లాంటి కొరడాలతో కొడతారు. అగ్నిలా మండిపోతున్న ఇసుకలో నడిపించుకుంటూ తీసుకెళతారు. ఆత్మలు అత్యంత బాధాకరమైన ఆ దారిలో నడవలేకపోతాయి. అలాగే ఆకలితో ఉంటాయి. ఆ సమయంలో యమదూతలు ఆత్మలను కొరడాలతో కొడుతూ మరింత నరకం చూపిస్తారు.
ఇక ఎలాగోలా యమలోకానికి చేరిన వెంటనే యమరాజు చివరి సారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు. ఇన్నాళ్లు ఉన్న తన శరీరం అంత్యక్రియలను చూసుకునే అవకాశాన్ని కల్గిస్తాడు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా..? లేదా..? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మ మళ్లీ కిందకు వస్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే పిండ ప్రదానం చేయాలి. లేదా ఇక ఆ ఆత్మకు మోక్షం ఉండదు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…