శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు. ఈ మాసంలో మహిళలు పెద్దఎత్తున ఉపవాస దీక్షలు ఉంటూ వివిధ రకాల పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున సంకటహర చతుర్ధిని జరుపుకుంటారు. ప్రతి నెలా కృష్ణపక్షంలో పౌర్ణమి తరువాత వచ్చే మూడవ రోజును సంకటహర చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన సంకటహర చతుర్దశి రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సంకటహర చతుర్దశి వ్రతాన్ని 3, 5, 11, లేదా 21 నెలల పాటు నిర్వహిస్తారు. ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతం చేసేవారు వేకువ జామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిని వినాయకుడి ముందు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఆ తర్వాత మన మనసులో ఏదైనా బలమైన కోరిక కోరుకునీ 3 గుప్పిళ్ల బియ్యం, ఆ తర్వాత రెండు తమలపాకులు, రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మన కోరికలు తలుచుకుని మూట కట్టాలి.
ఈ విధంగా మూట కట్టిన బియ్యాన్ని వినాయకుడి ముందు ఉంచి ధూపం వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టాలి. అదేవిధంగా సంకటహర చతుర్దశి కథను చదివి ఆ రోజు సాయంత్రం వినాయకుడి ఆలయానికి వెళ్లి స్వామివారికి సమర్పించి మూడు లేదా 11, లేక 21 ప్రదక్షిణలు చేయాలి. ఈ క్రమంలోనే ఉదయం పూజ చేసిన బియ్యాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి వారికి సమర్పించి ఆ తర్వాత ఉపవాసం ఉన్నవారు ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆ వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…