Tirumala : చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతి ఏటా కూడా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి విదేశీయులు కూడా వస్తారు. అయితే తిరుమల గురించి ఎవరికీ తెలియని బ్రహ్మ రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా గట్టు దగ్గర తీర్థం ఇస్తూ ఉంటారు. అయితే కొందరు అక్కడికి వెళ్లి తీర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరు వెళ్లకుండా వచ్చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఇచ్చే తీర్ధం స్వయంగా బ్రహ్మ తాకినది. ప్రతిరోజు రాత్రి అర్చకులు అక్కడ నీళ్లు, చందనాన్ని పెట్టి వెళ్ళిపోతారు. బ్రహ్మ అక్కడికి వస్తారు. బ్రహ్మ వలన ఆ తీర్థం తయారవుతుంది.
తిరుమలలో విశ్వక్సేనుడు ఉన్నారు. విశ్వక్సేనుడు ఉన్నారని చాలా మందికి తెలియదు. విమానం వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి ముందుకు వెళితే, అక్కడ విశ్వక్సేనుడు కనపడతారు. తిరుమలలో ఉండే హుండీ కూడా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంటుంది. దానిని మార్చరు. శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్రం యొక్క శక్తి హుండీ కింద ఉంది. అందుకే ఎప్పుడూ హుండీ స్థానం మారదు. అలానే వైకుంఠ ద్వారానికి బయట ఒక అమ్మవారు నిలబడి ఉంటారు.
ఆ అమ్మవారి చేతుల నుండి కాసులు కురుస్తున్నట్లు కనపడుతుంది. అమ్మవారిని ఎందుకు అక్కడ పెట్టారంటే, హుండీలో ఎవరు డబ్బులు వేస్తున్నారు అనేది ఆ అమ్మవారు గమనిస్తారు. అందుకే అక్కడ అమ్మవారు ఉంటారు. అలానే హుండీ కింద ఒక చిన్న తొట్టి లాంటిది ఉండి, దానికి గోముఖం కలిగి ఉంటుంది, దానిని తొట్టి తీర్థమని అంటారు. శ్రీవారిని తాకిన జాలం దాని నుండి వస్తాయి. తిరుమలలో రామానుజులు వారి విగ్రహం కూడా ఉంటుంది. తిరుమల పర్వతాన్ని ఆయన మోకాళ్ళతో ఎక్కారు.
రామానుజుల వారి గుడి పక్కన శక్తివంతమైన నారసింహ విగ్రహం ఉంది. దీన్ని కూడా చాలామంది చూడరు. తిరుమలలో అక్కడ ఒక స్తంభం కూడా ఉంటుంది. ఆ స్తంభం ఏంటి ఇక్కడ వుంది అని భక్తులు ఆశ్చర్యపోతారు. కానీ తిరుమల ఆలయాన్ని కట్టినప్పుడు ఆ స్తంభాన్ని మొదట పెట్టారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఆ స్తంభాన్ని కౌగిలించుకుని స్వామివారిని దర్శించుకుంటే, మళ్లీ తిరుమల వచ్చేసరికి సొంత ఇల్లు కట్టుకుంటారని నమ్మకం.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…