Camphor : ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పూజలు చేస్తారు. పూజ చేసినప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తారు. దానితో పాటుగా హారతి కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్లో హారతి కర్పూరాన్ని వెలిగిస్తే ఏమవుతుంది..?, అసలు ఎందుకు హారతి కర్పూరాన్ని వెలిగించాలి..? అనేది తెలుసుకుందాం. ప్రతి రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే, చాలా మంచి జరుగుతుంది. ఇల్లంతా కూడా సానుకూల శక్తితో నిండిపోతుంది. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి, ఐశ్వర్యం కూడా లభిస్తుంది.
కర్పూరం అనేక సమస్యలను దూరం చేస్తుంది. రోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వలన అనేక మార్పులు కలుగుతాయి. మరి ఇక ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకోండి.. వాస్తు దోషాలు కర్పూరాన్ని వెలిగించడం వలన తొలగిపోతాయి. కర్పూరంని మనం ఇంట్లో వెలిగించడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. హాయిగా ఉండొచ్చు. కర్పూరాన్ని వెలిగిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
కర్పూరం యొక్క సువాసన ఇల్లంతా వ్యాపించడం వలన ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి అంతా తొలగిపోతుంది. అదే విధంగా ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అదే విధంగా ఇంట్లో తగాదాలు తగ్గుతాయి. కర్పూరాన్ని వెండి లేదా ఇత్తడి గిన్నెలో వేసి వెలిగిస్తే, ఇంకా మంచిది.
వైవాహిక జీవితంలో సమస్యల్ని కూడా కర్పూరం దూరం చేస్తుంది. కర్పూరంతో పడక గదిని క్లీన్ చేస్తే, భార్యా భర్తల మధ్య సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కర్పూరం వలన సైంటిఫిక్ గా కూడా ఉపయోగము వుంది. కర్పూరం ఇంటి చుట్టూ ఉండే బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. దానితో అనారోగ్య సమస్యలు కలగవు. చూసారు కదా కర్పూరం వలన ఎన్ని లాభాలను మనం పొందొచ్చు అనేది. మరి పూజ చేసినప్పుడు కర్పూరం ని వెలిగించడం మరిచిపోకండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…