హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో నిత్యం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరికొందరు శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన సోమవారం, మంగళవారం, శుక్ర ,శని వారాలలో ఉపవాసం ఉంటారు. ఈ విధంగా ఉపవాసం ఉన్నవారు శ్రావణ మాసంలో కొన్ని ఆహార పదార్థాలను అసలు ముట్టకూడదని పండితులు చెబుతున్నారు.మరి శ్రావణ మాసంలో ఎలాంటి ఆహార పదార్థాలను ముట్టకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నవారు లేదా ఇతరులు కూడా ఆకుకూరలను, వంకాయలను తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని ఈ మాసంలో తినడం వల్ల అశుభం కలుగుతుందని చెబుతారు. అదేవిధంగా ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. సాగర మధనం చేస్తున్న సమయంలో రాక్షసులు అయినా రాహువు కేతువు దేవతలుగా మారి అమృతాన్ని తాగడంతో విష్ణుమూర్తి వారి శిరస్సులు ఖండిస్తాడు. ఈ విధంగా శిరస్సు ఖండించడం వల్ల వారి గొంతులో నుంచి అమృతం బయటకు వస్తుంది.
ఈ విధంగా గొంతులో నుంచి అమృతం బయటకు వచ్చినప్పుడు అమృతం నుంచి ఉల్లిపాయ వెల్లుల్లి ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి.అందుకే ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినడం వల్ల వారికి కూడా రాక్షస ఆలోచనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మాంసం చేపలను కూడా ఈ మాసంలో ముట్టుకోకూడదు. చేపలు తన సంపదను వృద్ధి చేసుకోవడానికి ఈ మాసం ఎంతో అనుకూలమైనది కనుక ఈ మాసంలో చేపలు తినకూడదనీ చెబుతారు. ఇక మత్తు పదార్థాలను కూడా ఈ మాసంలో తీసుకోకూడదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…