రాజస్థాన్ పోలీసులు క్రూర మృగం లాంటి ఓ నిందితున్ని 24 గంటల్లోనే పట్టుకున్నారు. మొత్తం 700 మంది పోలీసులు ఎప్పటి కప్పుడు నిఘా ఉంచి నిందితున్ని ట్రేస్ చేయగలిగారు. ఓ 4 ఏళ్ల బాలికను అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితున్ని అత్యంత వేగంగా పట్టుకోగలిగారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో సురేష్ కుమార్ (25) అనే వ్యక్తి దారిలో వెళ్తూ ఇంటి బయట ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అక్కడికి 5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్ద ఆ బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశాడు. అయితే ఆ తరువాత అతను పారిపోయాడు.
ఈ క్రమంలో ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితున్ని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జైపూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ శంకర్ దత్ శర్మ ఆధ్వర్యంలో 700 మంది పోలీసులు రంగంలోకి దిగారు. సదరు నిందితున్ని ట్రేస్ చేశారు.
అయితే సురేష్ కుమార్ వద్ద ఫోన్ లేదు. దీంతో అతన్ని ట్రేస్ చేయడం ఒక దశలో కష్టతరం అయింది. అయినప్పటికీ స్థానికంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా అతని కదలికలపై నిఘా ఉంచారు. దీంతో 24 గంటల్లోనే నిందితున్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…