ఆఫ్‌బీట్

భార‌త ఆర్మీలో వాడే అద్భుత‌మైన వాహ‌నాలు ఏమిటో తెలుసా ?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టి. ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు భార‌త్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో అనేక దేశాల క‌న్నా మెరుగ్గా ఉంది. చైనా వంటి పెద్ద దేశానికి కూడా భార‌త్ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది అంటే అతిశ‌యోక్తి కాదు. ఇక భార‌త ఆర్మీలో వాడే అద్భుత‌మైన వాహ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మ‌హీంద్రా ఆర్మ‌ర్డ్ లైట్ స్పెష‌లిస్ట్ వెహిక‌ల్

మ‌హీంద్రా ఆర్మ‌ర్డ్ లైట్ స్పెష‌లిస్ట్ వెహిక‌ల్ (ASLV) బాలిస్టిక్ ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. ముందు, వెనుక‌, ప‌క్క భాగాల్లో.. అన్ని వైపుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. లోప‌ల ఆయుధాల‌ను తీసుకెళ్ల‌వ‌చ్చు. 400 కిలోల బ‌రువు మోస్తుంది. ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచ‌ర్‌, మీడియం మెషిన్ గ‌న్ వంటి స‌దుపాయాలు ఇందులో ఉన్నాయి. 212 బేసిక్ హార్స్ ప‌వ‌ర్‌ను క‌లిగి ఉంటుంది. 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో ఈ వాహ‌నాలు 1300 వ‌ర‌కు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ స‌ర‌ఫ‌రా చేసింది.

2. క‌ల్యాణి ఎం4

ఈ ఏడాది ఆరంభంలో ల‌డ‌ఖ్‌లో ఈ వాహ‌నాల‌ను ప్రారంభించాక వీటిని ఇండియ‌న్ ఆర్మీలోకి తీసుకున్నారు. చైనాతో నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో వీటిని ఆర్మీలోకి తెచ్చారు. అత్యంత ఎత్త‌యిన ప్ర‌దేశాల‌కు ఈ వాహ‌నాలు వెళ్ల‌గ‌ల‌వు. క‌ఠిన వాతావ‌ర‌ణ పరిస్థితుల‌ను త‌ట్టుకుని న‌డుస్తాయి. ఒక్క క‌ల్యాణి ఎం4 వాహ‌నంలో 8 మంది వెళ్ల‌వ‌చ్చు. 2.3 ట‌న్నుల బ‌రువును మోస్తుంది. 465 బేసిక్ హార్స్ ప‌వ‌ర్ ఉంటుంది.

3. మ‌హీంద్రా MPV-I

ఆఫ్ రోడ్‌లోనూ ఈ వాహ‌నాలు సుల‌భంగా ప్ర‌యాణిస్తాయి. 2010లో ఈ వాహ‌నాల‌ను డిజైన్ చేశారు. యాంటీ టెర్ర‌రిజం, యాంటీ న‌క్స‌లైట్ ఆప‌రేష‌న్ల‌కు, కొండ ప్రాంతాల్లో తిరిగేందుకు ఈ వాహ‌నాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. 21 కిలోల భారీ పేలుడు ప‌దార్థం పేలినా ఈ వాహ‌నం ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. రూఫ్ హ్యాచ్‌, గ‌న్ పోర్ట్స్, మల్టీ లేయ‌ర్డ్ బాలిస్టిక్ గ్లాస్‌, ప్రొటెక్టెడ్ ఫ్యుయ‌ల్ ట్యాంక్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. ఇందులోని ఇంజిన్ 227 బేసిక్ హార్స్ ప‌వ‌ర్‌ను క‌లిగి ఉంది. 6X6 డ్రైవ్‌ను అందిస్తుంది.

4. రెనాల్ట్ షెర్పా

భార‌త్‌కు చెందిన ర‌క్ష‌ణ రంగంలోని వివిధ విభాగాల్లో ఈ వాహ‌నాల‌ను వాడుతున్నారు. నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) క‌మాండోలు, సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) వారు ఈ వాహ‌నాల‌ను వాడుతున్నారు. 4×4 చాసిస్‌ను ఈ వాహ‌నాలు క‌లిగి ఉంటాయి. ఇందులో ఒక్క వాహనంలో న‌లుగురు కూర్చోవ‌చ్చు. వాహ‌నంలో కూర్చునే సుల‌భంగా కాల్పులు జ‌ర‌ప‌వ‌చ్చు.

5. మ‌హీంద్రా మార్క్స్‌మ‌న్

ఇదొక లైట్ బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం. 6 మంది ప్ర‌యాణించ‌వ‌చ్చు. చిన్న‌పాటి ఆయుధాలు, గ్రెనేడ్ అటాక్‌ల నుంచి మాత్ర‌మే ఈ వాహ‌నం ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM