హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో వచ్చే తొలి పండుగను నాగ పంచమి అంటారు. శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున భక్తులు పుట్టను సందర్శించి పుట్టలో పాలు పోస్తారు.
అదేవిధంగా నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ విధంగా నాగపంచమి పండుగను జరుపుకోవడానికి కారణం ఏమిటి? ఈ పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఆదిశేషుడు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరాడు. తాను ఉద్భవించిన రోజు లోకం మొత్తం తనకు పూజలు చేయాలనే కోరిక కోరడం చేత నాగ పంచమి రోజు చాలామంది ప్రజలు సర్పరాజుకు పూజలు చేస్తారు.
ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 13వ తేదీ వచ్చింది. ఈరోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని పుట్టలో పాలు పోసి నాగ పంచమి వేడుకలను జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసంతో నాగదేవతను పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్య ఫలం కలుగుతుంది.
నాగ పంచమి రోజు స్వామివారికి గోధుమ రవ్వతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేయటం వల్ల దేవత సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి.
మరీ ముఖ్యంగా ఈ నాగ పంచమి రోజు తొమ్మిది రకాల పాములకు పూజిస్తారు. ఆ తొమ్మిది రకాల పాములు ఏమిటంటే.. అనంత, వాసుకి, శేష, కలియ, శంఖపాల, తక్షక, కంబాల, ధ్రుత రాష్ట్రం, పద్మనాభం వంటి రకాలను పూజిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…