Mauli Thread : ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు కదా..! అదేనండీ.. పూజలు, వ్రతాలు చేసినప్పుడు, శుభ కార్యాలప్పుడు చేతులకు కడతారు కదా. అదే.. ఇక దేవాలయాల్లో కల్యాణాల వంటివి చేయించినప్పుడు కూడా పూజారులు చేతులకు కడతారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. అయితే నిజానికి అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా..? దాన్ని ఎందుకు కడతారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వామనావతారం గురించి తెలుసు కదా. బలి చక్రవర్తి వద్దకు ఆయన వచ్చి వరం కోరుకుంటాడు. మూడడుగుల స్థలం కావాలని అడగ్గానే వామనుడు ఒక అడుగును భూమిపై, మరో అడుగుపై ఆకాశంపై పెడతాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏ మాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమంటాడు. దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతను పాతాళంలోకి పోతాడు. దీంతో బలి దాన గుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడిగా ఉండేలా వరం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని కడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు.
అలా మౌళి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతిలు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకనే మౌళి దారాలను కడతారు. ఇదీ.. ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే.. ఆ మూడు రంగులు నవగ్రహాల్లో మూడింటిని ప్రతిబింబిస్తాయి. అవి బృహస్పతి, కుజుడు, సూర్యుడు. వీరు వ్యక్తుల ఐశ్వర్యానికి, సుఖానికి, విద్యకు, ఆరోగ్యానికి కారకులట. అందుకని ఆ గ్రహ పీడ ఉండొద్దనే ఉద్దేశంతో ఆ రంగులతో ఉన్న మౌళి దారాన్ని కడతారు. ఇక దీన్ని మగవారికి కుడి చేతికి కడతారు. ఆడవారికి ఎడమ చేతికి కడతారు. పెళ్లి కాని ఆడవారైతే వారికి కూడా కుడి చేతికే కడతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…