ఆరోగ్యం

Pineapple : పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు నాలుక ప‌గులుతుంది.. అలా ఎందుక‌వుతుందో తెలుసా..?

Pineapple : మ‌న‌కు మార్కెట్‌లో త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్న పండ్ల‌లో పైనాపిల్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌రల్స్ ఈ పండ్ల‌లో ఉన్నాయి. అన్ని సీజ‌న్ల‌లోనూ పైనాపిల్ మ‌న‌కు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్‌ను తింటే ఎవ‌రికైనా నాలుక అంతా ప‌గిలిన‌ట్టు అవుతుంది. దీంతోపాటు నాలుక‌పై దుర‌ద కూడా పుడుతుంది. మంట వ‌స్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్ పండును తిన్న‌ప్పుడు నాలుకంతా ప‌గులుతుంది. కొంత మందికి మంట, దుర‌ద‌గా కూడా అనిపిస్తుంది. అందుకు కార‌ణం ఏమిటంటే బ్రొమిలెయిన్ అనే ర‌సాయ‌న‌మే. అయితే దీంతో మ‌న‌కు ఎలాంటి అపాయం లేదు. అంతా మేలే జ‌రుగుతుంది. పైనాపిల్ పండును తిన్న‌ప్పుడు అందులోంచి బ్రొమిలెయిన్ ర‌సాయం విడుద‌లై అది కెమిక‌ల్ రియాక్ష‌న్ వ‌ల్ల మ‌ళ్లీ వివిధ ర‌సాయ‌నాలుగా మారుతుంది. దీంతోపాటు నాలుక‌పై ఉండే ప్రోటీన్ విడిపోతుంది. అందువ‌ల్లే మ‌న‌కు పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు అలా నాలుక‌ దుర‌ద‌గా ఉంటుంది. ప‌గులుతుంది. ఈ క్ర‌మంలో పైనాపిల్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో చేరే బ్రొమిలెయిన్ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది.

Pineapple

అంటే నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తుంద‌న్న‌మాట‌. అంతేకాదు దీంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. అంటే వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వచ్చే ముడ‌త‌ల‌ను త‌గ్గిస్తుంద‌న్న‌మాట‌. దీంతో ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉండ‌వ‌చ్చు. అదేవిధంగా బ్రొమిలెయిన్ వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫుడ్ అల‌ర్జీలు పోతాయి. ఆస్త‌మా, సైన‌స్‌, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి. ఇన్ని ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు పైనాపిల్‌ను తిన‌డం వ‌ల్ల క‌లుగుతాయి.

అయితే పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు మ‌న నాలుక‌ ప‌గ‌ల‌కుండా, మంట పుట్ట‌కుండా, దుర‌ద‌గా ఉండ‌కుండా చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఓవెన్ గ్రిల్‌పై పైనాపిల్ ముక్క‌ల‌ను వేసి గ్రిల్ చేసుకుని తింటే నోరు ప‌గ‌ల‌దు. పైనాపిల్ ముక్క‌లు మృదువుగా లోప‌లికి వెళ్లిపోతాయి. అదే విధంగా పైనాపిల్ ముక్క‌ల‌పై కొద్దిగా ఉప్పు లేదా కారం చ‌ల్లుకుని తిన్నా నాలుక‌ ప‌గ‌ల‌దు. మంట పుట్ట‌దు. ఇంకో టిప్ ఏంటంటే పైనాపిల్‌ను కోసేట‌ప్పుడు పొట్టు రాకుండా చూసుకోవాలి. అలా పొట్టు రాకుండా పైనాపిల్ ముక్క‌ల‌ను కోసుకుని తిన్నా చాలు మ‌న నోరు ప‌గ‌ల‌దు. క‌నుక ఇక ముందు మీరు పైనాపిల్ ను తినేట‌ప్పుడు ఈ టిప్స్ పాటించి చూడింది. దీంతో నోరు ప‌గ‌ల‌కుండా చూసుకోవచ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM