Money : మిగతా విషయాలు ఎలా ఉన్నా చాలా మంది డబ్బుల విషయానికి వస్తే మాత్రం చాలా కచ్చితంగా ఉంటారు. అవును మరి, ఎందుకంటే డబ్బు అంటే సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపమే అని నమ్ముతారు కదా. అందుకనే చాలా మంది శుక్రవారం పూట డబ్బులను ఇవ్వరు. వస్తే తీసుకుంటారు గానీ డబ్బులను ఇచ్చేందుకు మాత్రం విముఖతను ప్రదర్శిస్తారు. ఎంతో పురాతన కాలం నుంచి ఈ ఆచారాన్ని మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు. దాన్నే మనం కూడా అనుసరిస్తున్నాం. అయితే ఇది సరే. కానీ అసలు అదే రోజున డబ్బులను ఇవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
భృగు మహర్షి బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడు. ప్రజాపతులలో, సప్త రుషుల్లో ఈయన ఒకరు. ఈయనకు, దక్ష ప్రజాపతి పుత్రిక ఖ్యాతిదేవికి వివాహం అవుతుంది. దీంతో భృగు మహర్షికి, ఖ్యాతి దేవికి ముగ్గురు సంతానం కలుగుతారు. వారు దాత, విధాత, శ్రీమహాలక్ష్మి. శ్రీమహాలక్ష్మి విష్ణువును వివాహమాడుతుంది. అయితే మనం వ్యవహరించే శుక్రవారానికి మరోపేరు భృగు వారం. ఈ క్రమంలో ఆ రోజునే మహాలక్ష్మి ఆయన్ను విడిచి విష్ణువును పెళ్లి చేసుకుని వెళ్లిందని చెబుతారు. అందుకే ఆ రోజున మహాలక్ష్మి స్వరూపమైన డబ్బును ఎవరూ ఇతరులకు ఇవ్వరు. అలా ఇస్తే ఇక వారికి ఆ డబ్బు దక్కడం కష్టమేనట. ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయట. అందుకే శుక్రవారం పూట ఎవరూ డబ్బును ఇతరులకు ఇవ్వరు.
ఇక శుక్రవారమే కాదు, మంగళవారం కూడా డబ్బును ఎవరూ ఇతరులకు ఇవ్వరు. కానీ దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే ఉంటారు. మరి మంగళవారం ఎందుకు డబ్బును ఇతరులకు ఇవ్వరు అంటే.. ఆ రోజు కుజ గ్రహానికి సంబంధించినది. కుజుడు మానవులకు సంపదను, ఆరోగ్యాన్ని, కలహాలు లేని వైవాహిక జీవితాన్ని ఇస్తాడట. అందుకని ఆ రోజున ఎవరైనా సంపదను దూరం చేసుకుంటే అలాంటి వారికి కుజుడు ఇక సంపదను అనుగ్రహించడట. దీంతో కష్టాలు వస్తాయని నమ్ముతారు. అందుకే మంగళవారం రోజున కూడా డబ్బును ఎవరూ ఇతరులకు ఇవ్వరు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…