ఆధ్యాత్మికం

Lord Hanuman : హనుమంతుడి తోకకి గంట ఎందుకు ఉంటుంది..? దాని వెనుక ఇంత పెద్ద కథ ఉందని తెలుసా..?

Lord Hanuman : హనుమంతుడి తోకకి గంట ఉండడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..? అసలు ఎందుకు హనుమంతుడి తోకకి గంట ఉంటుందో ఈరోజు చూద్దాం. సీతమ్మని ఎత్తుకెళ్లిపోవడంతో రాముడు సీతమ్మ గురించి వెతుకుతూ ఉంటారు. అయితే రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతుడితో చెలిమి కుదురుతుంది. వానర రాజుగా అన్న స్థానంలో ఉన్న సుగ్రీవుడు సీతమ్మని వెతకడానికి నాలుగు వైపులా వానరుల్ని పంపుతాడు. యుద్ధం తప్ప మరే మార్గం లేదని రాముడు క‌పి సైన్యాన్ని, భల్లూకములతో జతకూర్చాడు. యుద్దానికి వెళ్తున్న వారంతా కూడా ఆఖరి సారి వారి వాళ్ళని చూసుకోవడం చూసిన రాముడు కరిగిపోయాడు.

మీరు మీ వాళ్ళందర్నీ కూడా వదిలేసి యుద్ధానికి వస్తున్నారు. నేను ఎవరి రుణాన్ని ఉంచుకొని, అందర్నీ మళ్ళీ తిరిగి క్షేమంగా తీసుకొస్తానని రాముడు చెప్తాడు. రామసేవ కోసం సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నతకాయులతోపాటుగా సింగిలీకులు అని పిలవబడే పొట్టి మరుగుజ్జు కోతులు కూడా వచ్చాయి. ఇవి కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వీటికి పదునైన గోళ్లు ఉంటాయి. అవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకులు కలిపి గుంపులుగా శత్రువుల మీద దాడి చేస్తాయి. గోళ్ళతో రక్కుతాయి. పళ్ళతో కొరుకుతాయి.

Lord Hanuman

కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్నాడు. ఎత్తయిన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకి చిన్న చిన్న గంటలు ఉన్నాయి. కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది. ఆ సమయంలో వెయ్యి మంది సింగిలీక కోతులు గుంపులుగా వెళ్తాయి. కుంభకర్ణుడి రథం కింద తెగిన గంట వీటి మీద పడిపోతుంది. ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోతాయి. చీకటి పడిపోతుంది. వీటికి ఏమో భయం వేస్తుంది.

ఎవరూ రాకపోవడంతో ఇక మాట్లాడుకుంటాయి. యుద్ధానికి ఎందుకు వచ్చాము అనుకోవడం అలానే రాముడిని కూడా ఏవేవో మాటలు అంటాయి. ఈలోగా ఒక ముసలి కోతి అనవసరంగా ఆడిపోసుకోవడం వలన ఉపయోగం లేదు. రామనామ స్మరణ చేద్దాము అని అనేసరికి ఇవన్నీ మొదలు పెడతాయి. ఈలోగా బయట రాముడు రావణుడిని సంహరించాడు.

రాముడు సీతమ్మని చేపట్టాడు. అందరూ ఉన్నారా లేదా అని లెక్క పెట్టుకుంటే వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అంతలో ఒక గంటపై దృష్టి పడుతుంది. వెంటనే రాముడు హనుమా అని అంటాడు. తోకను పెంచి గంటను పైకి లేపాడు హనుమంతుడు. ఆ గంట కింద ఉన్న వెయ్యి కోతులు కూడా బయటికి వచ్చేస్తాయి. అయితే రాముడు మాట తప్పడు అని అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ కోతుల కథకు గుర్తుగా, తోకతో గంటను కలిగిన రూపాన్ని ఎవరు ప్రార్థిస్తారో వాళ్లకి అనుగ్రహం రెండింతలు లభిస్తుందని వరం ఇస్తాడు రాముడు. ఇదీ హనుమంతుడి తోకకి ఉన్న గంట వెనుక కథ.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM