ఆధ్యాత్మికం

Achamanam : ఆచమనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందని చాలా మందికి తెలియ‌దు..

Achamanam : మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మొదట దీపారాధన చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం ఆచమనం చేస్తూ ఉంటాము. అయితే ఆచమనం ఎందుకు చేయాలి..? దీని వెనుక ఏదైనా ముఖ్య కారణం ఉందా..? ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. నిజానికి ఆచమనం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన గొంతు ముందు భాగంలో నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీన్ని స్వర పేటిక అంటాము. దీని చుట్టూ కవచం ఉంటుంది. దీంతో కొంత దాకా మనకి రక్షణ కలుగుతుంది. అయితే ఏ చిన్న గాయమైనా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోతుంది. ప్రాణం కూడా పోవచ్చు. స్వర పేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి.

ముక్కు, నోరు, పెద‌వులు, నాలుక, దంతాలు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, అలానే గొంతు లోపలి భాగం, శ్వాసనాళం, అన్న నాళం ఇటువంటివన్నీ కూడా నాజూగ్గా ఉంటాయి. వీటికి బలం కలిగించి, ఉత్తేజ పరుస్తుంది ఆచమనం ప్రక్రియ. మన గొంతులో నుండి శబ్దం వెలువడేటప్పుడు అక్కడ ఉన్న గాలి బయటకి రావడం జరుగుతుంది. అయితే గాలి లోపల నుండి బయటకు వస్తున్నప్పుడు వేగం వుండకూడదు. శబ్దం చాలా సులభంగా, స్పష్టంగా ఉండాలి.

Achamanam

కేశవాయ స్వాహా అని అన్నప్పుడు అది గొంతు నుండి వస్తుంది. నారాయణ స్వాహా అనేది నాలుక సహాయంతో బయటకు వస్తుంది. మాధవాయ స్వాహా అనేది కేవలం పెద‌వులు మాత్రమే పలుకుతాయి. అయితే ఇలా మనం ఆచమనం చేయడం వలన గొంతు, నాలుక, పెద‌వులకి వ్యాయామం అవుతుంది. నోటితో చెప్తే సరిపోతుంది కదా.. చేతితో ఎందుకు నీళ్లు తాగాలి అనేది చూస్తే.. చేతుల్లో కొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది.

చేతిలో నీళ్లు వేసుకుని తాగితే ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని, నోటి నుండి శరీరంలోకి వెళ్తాయి. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా సమతావుగా ఉండేట్టు చేస్తుంది. ఇలా మనం కొద్దికొద్దిగా వీటిని చెబుతూ నీళ్లు తాగడం వలన నాలుక, గొంతు, పేగుల‌ వరకు ఉన్న సున్నితమైన అవయవాలన్నీ కూడా ఉత్తేజంగా మారతాయి. ఇదీ ఆచమనం వెనుక ముఖ్య కారణం.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM