ప్రతి ఏటా చైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత వచ్చే పండుగే శ్రీరామనవమి. చైత్రమాసం శుక్ల పక్షమి నాడు సచ్చిదానంద స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు. త్రేతాయుగంలో ఉన్న రాక్షసులను సంహరించడానికి కోసమే శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు. ఇటువంటి మహత్తరమైన రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి.
శ్రీరాముడు జన్మించిన శుక్ల పక్షం ఈ రోజున భక్తులు ఉపవాసంతో స్వామి వారి పూజలు చేసి ఆ రాత్రికి శ్రీ రాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణాలను చదువుతూ జాగరణ చేయాలి. అదేవిధంగా మరుసటి రోజు ఉదయం రాములు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాయసం, పప్పన్నం, పానకం ,పెసరపప్పును నైవేద్యంగా సమర్పించాలి. పలువురు బంధువులను పిలిచి వారికి ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టాలి. వీటితోపాటు బంగారం, నువ్వులను స్వామివారి చెంత సమర్పించి శ్రీరామనవమి వ్రతం ఆచరించాలి.
ఈ విధంగా శ్రీ రామ నవమి రోజు వ్రతం ఆచరించడం వల్ల జన్మాంతరముల పాపములన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. అదేవిధంగా శ్రీ రామ నవమి రోజు ‘శ్రీరామరామారామ’ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. శ్రీ రామ నవమి రోజు ఎటువంటి పనులు చేసినా చేయకపోయినా రామనామాన్ని స్మరించినచో సర్వపాపాలు తొలగిపోతాయని అగస్త్య మహర్షి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.