Goddess Lakshmi Devi : హిందువుల్లో చాలా మంది తమకు అష్టైశ్వర్యాలు కలగాలని తమకు ఇష్టమైన లక్ష్మీ దేవిని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే ధనానికి ఆమే అధిపతి. ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది జరుగుతుంది. కనుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు, ఇష్టాలను బట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న లక్ష్మీ దేవి పటాలను, బొమ్మలను పూజిస్తారు. కానీ మీకు తెలుసా..? కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే ధనం రాదట. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందట. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను, బొమ్మలను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లగూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదట. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టు పోతుందట. తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోను పూజించాలట. దీంతో అంతా శుభమే జరుగుతుందట. ఐశ్వర్యం సిద్ధిస్తుందట. గరుత్మంతునిపై విష్ణువుతోపాటు లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుందట. అంతా మంచే జరుగుతుందట.
శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా, ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. కుబేరుని విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట. దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మీ మనీ లాకర్‌లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.
లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవులను ఎక్కువగా వాడి పూజ చేయాలట. దీంతో అనుకున్నది జరుగుతుందట. దీపావళి రోజున లక్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంతరం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీని వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుందట. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే, ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా.. అనే మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…