ఆధ్యాత్మికం

Maha Shivarathri 2024 : మ‌హాశివ‌రాత్రి నాడు ఈ మంత్రాన్ని ప‌ఠించండి.. మీకు ఉన్న స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

Maha Shivarathri 2024 : పూర్వ‌కాలంలో రుషులు, దేవ‌త‌లు లేదా రాక్ష‌సులు ఎవ‌రైనా స‌రే ప‌ర‌మ శివుడి కోస‌మే ఎక్కువ‌గా త‌ప‌స్సు చేసేవారు. ఎందుకంటే శివుడు భోళాశంక‌రుడు క‌దా.. ఆయ‌న అడిగిన వ‌రాల‌ను కాదు లేదు అన‌కుండా ఇస్తాడు. క‌నుక‌నే శివున్ని చాలా మంది పూజిస్తారు. ఆయ‌న‌కు పెద్ద‌గా ఆడంబ‌రంగా పూజ‌లు గ‌ట్రా చేయాల్సిన ప‌నిలేదు. నిష్ట‌తో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శివ‌లింగంపై నీళ్ల‌తో అభిషేకం చేసి ఒక్క పుష్పాన్ని స‌మ‌ర్పిస్తే చాలు.. శివుడు ప్ర‌స‌న్నుడు అవుతాడు. కోరిన కోరిక‌ల‌ను తీరుస్తాడు.

ఇక ప్ర‌తి ఏటా మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం నాడు భ‌క్తులు ఉద‌యం నుంచే పూజ‌లు మొద‌లు పెడ‌తారు. ఉద‌యం నుంచే శివాల‌యాలు అన్నీ భ‌క్తుల‌తో నిండిపోతాయి. శివ‌లింగ ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ఆల‌యాల్లో బారులు తీరుతుంటారు. శివుడికి రుద్రాభిషేకం చేయిస్తారు. అయితే మ‌హాశివ‌రాత్రి రోజు ఇప్పుడు చెప్ప‌బోయే రెండు మంత్రాల‌ను సాయంత్రం పూట ప‌ఠించండి. దీంతో అన్ని స‌మ‌స్య‌లు పోతాయి, ప‌ర‌మ‌శివుడి అనుగ్ర‌హం ల‌భిస్తుంది.

Maha Shivarathri 2024

మ‌హాశివ‌రాత్రి రోజు సాయంత్రం స‌మ‌యంలో ధ్యానంలో కూర్చుని ఓం న‌మఃశివాయ అనే మంత్రాన్ని మీకు వీలున్న‌న్ని సార్లు జ‌పించండి. ఏకాగ్ర‌త‌తో ఈ మంత్రాన్ని జ‌పించండి. మ‌న‌సులోకి ఇత‌ర ఆలోచ‌న‌లు రానివ్వ‌కండి. దృష్టి, ధ్యాస‌నంతా ప‌ర‌మ‌శివుడిపైనే నిల‌పండి. అదే స‌మ‌యంలో మీకు ఉన్న ఏదైనా స‌మ‌స్య‌కు చెందిన కోరిక‌ను బ‌లంగా కోరండి. ఏదైనా ఒక కోరిక‌నే కోరండి.

పెళ్లి, వివాహం, సంతానం, దాంప‌త్య స‌మ‌స్య‌లు, విద్య‌, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స‌మ‌స్య‌లు, ఆరోగ్యం.. ఇలా స‌మ‌స్య ఏదైనా స‌రే ఒకే ఒక కోరిక కోరండి. ఆ కోరిక కోరుతూ ఓం న‌మఃశివాయ అనే మంత్రాన్ని జ‌పిస్తూ ధ్యాస‌నంతా ప‌ర‌మ‌శివుడిపైనే నిల‌పండి. ఇలా క‌నీసం 1 గంట‌పాటు అయినా చేయండి. లేదా మీకు వీలైతే ఇంకా ఎక్కువ స‌మ‌యం పాటు కూడా చేయ‌వ‌చ్చు. ఇలా మ‌హాశివ‌రాత్రి రోజు పైన చెప్పిన మంత్రాన్ని ప‌ఠిస్తూ శివున్ని ధ్యానించ‌డం వ‌ల్ల మీరు అనుకున్న‌వి నెర‌వేరుతాయి. ఏ స‌మ‌స్య అయినా స‌రే తొల‌గిపోతుంది. ఇక అదే రోజు మ‌హామృత్యంజ‌య మంత్రాన్ని కూడా పఠించ‌వ‌చ్చు. దీంతో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వు. మృత్యుభ‌యం పోతుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM