హిందూ క్యాలెండర్ ప్రకారం ఆరవ మాసమైన భాద్రపద మాసంలో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భాద్రపద శుక్ల పక్షం చవితి రోజున చతుర్దశి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు వినాయకుడిని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ పండుగ రోజు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించిన రోజు నుంచి నిమజ్జనం చేసే వరకు భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను చేస్తూ నైవేద్యాలను సమర్పిస్తూ వేడుకలను జరుపుకుంటారు.
మరి ఈ ఏడాది వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి పూజ చేయడానికి శుభ ముహూర్తం ఎప్పుడు ఉంది ? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ రోజున భక్తులు పెద్ద ఎత్తున విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ రోజు శుభ తిథి మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమై రాత్రి 9:57 వరకు ఉంటుంది.
వినాయకుడి పూజ చేయడానికి ఉదయం 11:30 గంటల నుండి 1:33 గంటల వరకు మంచి సమయం ఉంది. అందువల్ల ఈ సమయంలో గణేషుడికి పూజలు చేస్తే మంచిది. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి రోజు వినాయకుడు జన్మించాడని కొందరు భావించగా మరికొందరు వినాయకుడు విఘ్నేశ్వరుడుగా మారిన రోజు కనుక ఈ రోజును వినాయక చవితిగా జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన ఈ రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…