కొందరు సాధారణ సమస్యలతో హాస్పిటల్‌లో చేరుతుంటారు. కానీ వారికి కొన్ని సందర్భాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు పరీక్షల్లో తేలుతుంది. దీంతో జరగరాని నష్టం జరుగుతుంది. ఓ మహిళకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్‌లో చేరింది. కానీ దురదృష్టవశాత్తూ రెండు కాళ్లనూ, ఒక చేయిని కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
హంగేరీలోని పెక్స్ అనే ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల మోనికా ఈ ఏడాది జనవరిలో కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరింది. అయితే జీర్ణాశయానికి రంధ్రాలు పడ్డాయని సర్జరీ చేస్తే చాలని వైద్యులు చెప్పారు. కానీ తరువాతే షాకింగ్ విషయం తెలిసింది. ఓ అరుదైన వ్యాధి కారణంగా ఆమె కాళ్లలో రక్త నాళాలు బ్లాక్ అయ్యాయని, అందుకనే ఆమెకు జీర్ణాశయంలో నొప్పి ఏర్పడిందని వైద్యులు గుర్తించారు.
అయితే కాళ్లలో ఉన్న రక్త నాళాల బ్లాక్‌లు పైకి వస్తే ప్రమాదమని, అందువల్ల కాళ్లను తీసేయాలని వైద్యులు చెప్పారు. దీంతో మోనికా షాక్ కు గురైంది. అయినా తప్పదు కనుక అంగీకరించింది. దీంతో ఆమెకు మార్చి 1వ తేదీన ఎడమ కాలును తీసేశారు. మార్చి 8న కుడికాలును తీసేయగా, ఎడమ చేయికి కూడా బ్లాక్స్ వచ్చాయని చెప్పి మార్చి 12న ఎడమ చేయిని తొలగించారు.
అయితే ఆయా భాగాలను తొలగించినా ఆమె సమస్య తగ్గలేదు. కేవలం 3 నెలల్లోనే ఆమెకు 16 సార్లు ఆపరేషన్లు చేశారు. అయినప్పటికీ ఆమెకు ఉన్న అనారోగ్య సమస్యను వైద్యులు తగ్గించలేకపోతున్నారు. వైద్య శాస్త్ర చరిత్రలోనే ఇది ఓ అత్యంత అరుదైన కేస్ అని, దీని వెనుక జన్యు సంబంధ కారణాలు ఉండి ఉంటాయని, ప్రస్తుతం ఈ సమస్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు మోనికా పడుతున్న బాధ మాత్రం వర్ణనాతీతంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…