యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇటీవల ఆధార్ కార్డు దారుల కోసం పలు మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రకటించింది. దీని వల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని వారు కూడా UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి సులభంగా ఆధార్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు కార్డుదారులకు మొబైల్ ఫోన్ లేదా సొంత కంప్యూటర్ ఉండాల్సిన పనిలేదు. బయట ఎక్కడైనా ఆధార్‌ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
గతంలో ఆధార్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ దగ్గర ఉండాలి. దానికి వచ్చే ఓటీపీని నమోదు చేసి వెరిఫై చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా ప్రక్రియ అవసరం లేకుండానే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు గాను కింద తెలిపిన స్టెప్స్ ను అనుసరించాలి.
1. UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in ను సందర్శించి అక్కడ ఉండే My Aadhaar అనే సెక్షన్‌లోని Order Aadhaar reprint అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
2. తరువాత 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (వీఐడీ)ని నమోదు చేయాలి.
3. పూర్తయ్యాక సెక్యూరిటీ లేదా కాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
4. అనంతరం My mobile is not registered అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత ఆల్టర్నేటివ్ లేదా నాన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
5. తరువాత Send OTP పై క్లిక్ చేయాలి. Terms and Conditions కు ఓకే తెలిపాక, చివరిగా సబ్‌మిట్ పై క్లిక్ చేయాలి.
6. అన్ని స్టెప్స్‌ను పూర్తి చేశాక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Preview Aadhaar Letter for further verification for reprint అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ Make Payment పై క్లిక్ చేసి డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చి ఆధార్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
7. చివరిగా మీరు అక్కడ ఎంటర్ చేసిన ఫోన్ నంబర్‌కు ఓ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఆధార్ మీ ఇంటి చిరునామాకు పంపబడిందో, లేదో ఆ నంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…