మన తెలుగు క్యాలెండర్ ప్రకారం నాలుగవ మాసాన్ని ఆషాడ మాసంగా చెబుతాము. ఆషాడ మాసం ఎన్నో పండుగలు, వ్రతాలు వస్తాయి కాని ఈ నెలలో ఎటువంటి శుభకార్యాలను చేయరు. ఈ విధంగా ఆషాడ మాసంలో శుభకార్యాలను చేయకపోవడం మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తోంది. మనం ఏదైనా మంచి పని తలపెడితే అందుకు సరైన సమయం ముహూర్తం ఎంతో అవసరం. సరైన ముహూర్తం ఉన్నప్పుడే ఆ పని సక్రమంగా జరిగి మంచి జరుగుతుందని భావిస్తారు.
ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో తప్పనిసరిగా మంచి ముహూర్తాలను నిర్ణయిస్తారు. అదే ఆషాడమాసంలో మాత్రం ఎలాంటి పెళ్లిళ్లు కానీ శుభకార్యాలు గాని చేయరు. ఆషాడ మాసంలో శుభకార్యాలు చేయక పోవడానికి గల కారణాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం విష్ణుదేవుడు ఆషాఢమాసంలోనే యోగనిద్రలోకి వెళతాడని చెబుతారు. స్వామి వారు యోగ నిద్రలోకి వెళ్ళడం వల్ల స్వామివారి ఆశీస్సులు మనపై ఉండవని భావించి ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరు. అదే ఆషాడ మాసంలో ఎన్నో వ్రతాలు,పూజలు ఉండటం వల్ల పురోహితులకు పెళ్లిళ్ల చేయడానికి కుదరకపోవడంతో పూర్వకాలంలో ఈ మాసంలో పెళ్లిళ్లు చేసేవారు కాదు. అలాగే ముఖ్యంగా రైతులకు ఆషాడమాసంలో వ్యవసాయ పనులలో నిమగ్నమవుతారు అందుకోసమే ఈ ఆషాడమాసంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఉండడం పూర్వ కాలం నుంచి ఆచారంగా వస్తోంది. అయితే ప్రస్తుతం కూడా అదే పద్ధతులను అనుసరిస్తూ ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలను కానీ, పెళ్లిలను కానీ నిర్వహించరు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…