చాలా మందికి స్వీట్స్ తినాలంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బయట ఫుడ్ తినాలంటే కాస్త వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఎంతో ఇష్టమైన స్వీట్స్ బయట నుంచి కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు. మరి ఇంట్లో తయారుచేసుకొనే స్వీట్లలో కాలా జామున్ ఎంతో ప్రత్యేకమైనది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*కోవా 400 గ్రా
*బొంబాయి రవ్వ టేబుల్ స్పూన్
*బాదాం, కాజు ,పిస్తా గుప్పెడు
*బేకింగ్ పౌడర్ చిటికెడు
*నెయ్యి సరిపడా
*చెక్కర -కేజీ
*పన్నీర్ 100గ్రాములు
*మైదా -అరకప్పు
ముందుగా కాలా జామూన్ తయారు చేయడానికి చక్కెర పాకం తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఒక కిలో పంచదారకు రెండు కప్పుల నీటిని వేసి చక్కెర పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పన్నీరు ఉండలు లేకుండా కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులోకి బొంబాయి రవ్వ, చిటికెడు బేకింగ్ సోడా, కోవా వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో ముంచి రెండు స్పూన్ల మిశ్రమాన్ని పక్కకు తీసుకొని అందులో కొద్దిగా చక్కెర, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్ వేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిగిలిన జామున్ మిశ్రమంతో కొద్దిగా పెద్ద ఉండలు తయారు చేసుకుని అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కలర్ వేసి మనకు నచ్చిన రీతిలో పొడవుగా లేదా గుండ్రంగా తయారుచేసుకొని బాగా మరుగుతున్న నూనెలో వేసి ముదురు ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న జామూన్స్ ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచి కరమైన కాల జామున్ తయారైనట్లే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…