హిందూ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. అదేదో సినిమాలో చెప్పినట్లు.. అప్పటి వరకు గరుడ పురాణం గురించి చాలా మందికి తెలియదు. కానీ దాన్ని చదవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే మనిషి చనిపోయాక అతనికి నరకంలో విధించే శిక్షల వివరాలు గరుడ పురాణంలో ఉంటాయి. అందవల్ల ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని, అశుభం కలుగుతుందని కొందరు చెబుతారు. మరి ఇందులో నిజమెంత ? అంటే..
అన్ని పురాణాల్లాగే గరుడ పురాణం ఒకటి. నరకంలో మనుషులకు విధించే శిక్షల వివరాలు ఉంటాయి, కనుక దాన్ని ఇంట్లో పెట్టుకోరాదని కొందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అది ఒక పుస్తకం. దుష్టశక్తులకు నిలయం కాదు. మనకు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది. మనం పాపాలు ఎందుకు చేయకూడదో చెబుతుంది. దాంతో మనం జాగరూకులమై ఉంటాము. కానీ ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి చెడు జరగదు. అది మన విజ్ఞానానికి దోహద పడుతుంది.
అయితే గరుడ పురాణంలో ప్రేత ఖండం అని ఒక భాగం ఉంటుంది. అందులో ప్రేత శబ్దం ఎక్కువగా వస్తుంది. శవాలను ఉద్దేశించి ఆ శబ్దాన్ని వాడుతారు. ఇంట్లో శవం గురించి మాట్లాడకూడదు, అమంగళంగా, అశుభంగా ఉంటుంది, కనుక ఆ ఒక్క ప్రేత ఖండాన్ని మాత్రం ఆలయంలో చదవాలని చెబుతారు. ఇక అందులో ఉన్న మిగతా వివరాలను ఇంట్లో కూడా చదువుకోవచ్చు. అంతేకానీ గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు అని భావించడంలో అర్థం లేదు. ఒక పుస్తకం మనకు చెడు కలిగించదు.. అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…