టెక్నాల‌జీ

రూ.251 కే స్మార్ట్ ఫోన్ గుర్తుందా ? ఫ్రీడ‌మ్ 251 పేరిట జ‌నాల‌కు భారీగా కుచ్చు టోపీ పెట్టారు.. ఆ కేసు ఏమైంది ?

అప్ప‌ట్లో ఫ్రీడ‌మ్ 251 పేరిట కేవ‌లం రూ.251 చెల్లిస్తే చాలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది గుర్తుంది క‌దా. దీంతో ఆ ఫోన్ కోసం చాలా మంది ఎగ‌బ‌డ్డారు. అస‌లు రూ.251కే స్మార్ట్ ఫోన్ వ‌స్తుందా ? అనే క‌నీస విష‌యం కూడా ఆలోచించ‌కుండా పెద్ద ఎత్తున జ‌నాలు ఆ ఫోన్‌ను రూ.251 చెల్లించి బుక్ చేశారు. కానీ ఫోన్ బుకింగ్స్ ప్రారంభ‌మైన తొలి రోజే అది స్కాం అని తేలింది.

2016 ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన మోహిత్ గోయెల్ అనే వ్య‌క్తి రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట కేవ‌లం రూ.251కే ఆండ్రాయిడ్ ఫోన్ ను అందిస్తామంటూ పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు చేశాడు. దీంతో తొలి రోజు చాలా మంది రూ.251 చెల్లించి ఫోన్ల‌ను ముంద‌స్తుగా బుక్ చేశారు. మొద‌టి రోజు 30వేల మందికి పైగానే ఆ ఫోన్ బుక్ చేసుకున్నారు. అయితే త‌రువాత ఆ ఫోన్ ను ఎందరు బుక్ చేశారో తెలియ‌దు కానీ మొత్తం రూ.60 కోట్ల మేర డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. కానీ ఆ వివ‌రాల‌ను మోహిత్ గోయెల్ వెల్ల‌డించ‌లేదు.

అయితే ఆ త‌రువాత ఇదొక స్కామ్ అని కొంద‌రు కేసు వేశారు. కానీ మోహిత్ మాత్రం తాము ఫోన్ల‌ను డెలివ‌రీ చేసేందుకు ఆల‌స్యం అవుతుంద‌ని, జూ 9, 2016 వ‌ర‌కు 5000 ఫోన్ల‌ను డెలివ‌రీ చేశామ‌ని, మిగిలిన వారికి కూడా ఫోన్ల‌ను డెలివ‌రీ చేస్తామ‌ని, అందుకు ప్ర‌భుత్వాలు స‌హాయం చేయాల‌ని కోరాడు. కానీ ఆ త‌రువాత ఆ ఫోన్లు ఎవ‌రికీ డెలివ‌రీ అయిన దాఖ‌లాలు లేవు. త‌రువాత ఆ విష‌యాన్ని మ‌రిచిపోయారు. ఇలా మోహిత్ గోయెల్ అనే వ్య‌క్తి భారీ ఎత్తున స్కామ్ చేశాడు. కానీ మీడియాకు మాత్రం ఫోన్ల‌ను డెలివ‌రీ చేశాన‌నే చెప్పుకొచ్చాడు. అయితే ఈ విష‌యంలో నిజం ఏమిటో తెలియ‌దు, కానీ ఆ ఫోన్ల‌ను డెలివ‌రీ అందుకున్న వారికే అస‌లు విష‌యం తెలుస్తుంది.

అయిన‌ప్ప‌టికీ ఇదొక పెద్ద స్కామ్ అని జ‌నాల‌కు ఇప్ప‌టికీ గుర్తు లేదు. దాని గురించే మ‌రిచిపోయారు. కేవ‌లం రూ.251 మాత్ర‌మే క‌దా అని చాలా మంది లైట్ తీసుకున్న‌ట్టున్నారు. కానీ అలా కొన్ని వేల మంది బుక్ చేశారు క‌దా.. క‌నుక అది పెద్ద మొత్త‌మే అవుతుంది. అయినా ఇలాంటి స్కాములు అప్ప‌టి క‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తాయి కానీ.. త‌రువాత పెద్ద‌గా ప‌ట్టించుకోరు. జ‌నాలు పూర్తిగా మ‌రిచిపోతారు. ఇక్క‌డ కూడా ఇలాగే జ‌రిగింది. ఇంకా ఇలాంటి స్కామ్‌లు అనేక విష‌యాల్లో జ‌రుగుతూనే ఉన్నాయి. ఏం చేస్తాం.. ప్ర‌జ‌ల త‌ల‌రాత అలాంటిది మ‌రి..!

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM