అత్త వారింటికి వెళ్లిన ఓ నవ వధువుతో ఆమె తండ్రి అప్పట్లో భారీ మొత్తంలో సారెను పంపిన వార్త గుర్తుందా ? భారీ ఎత్తున స్వీట్లు, పచ్చళ్లు, కూరగాయలు, మాంసం వంటి పదార్థాలను, వస్తువులను పంపించాడు. దీంతో ఆ వార్త వైరల్ అయింది. అయితే వియ్యంకుల వారు చేసిన మర్యాదకు ఉబ్బి తబ్బిబ్బైన పెళ్లి కొడుకు తరఫు తల్లిదండ్రులు ఇప్పుడు తమ సత్తా ఏంటో చూపించారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మిల పెద్ద కుమార్తె ప్రత్యూష దేవికి, యానాంకు చెందిన తోట రాజు, నాగలక్ష్మిల కుమారుడు పవన్‌కుమార్‌కు గత మే నెలలో వివాహం అయింది.
అయితే ఆషాఢం సందర్భంగా యానాంకు వచ్చిన వధువు భారీ ఎత్తున సారె తెచ్చింది. ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. ఇక పెళ్లి కొడుకు శ్రావణంలో అత్త వారింటికి వస్తూ అప్పుడు తమకు వారు ఎలా సారె పంపించారో ఇప్పుడు కూడా అదే రీతిలో అతను భారీ ఎత్తున సారెను తన అత్తింటి వారికి తీసుకెళ్లాడు. ఆ సారెలో 10వేల కిలోల స్వీట్లు, 100 అరటి గెలలు, రెండు వ్యాన్లలో పూలు, పండ్లు, వందలాది చీరలు, రవికలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత ఈ వార్త కూడా వైరల్ అవుతోంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…