Betel Leaves Plant : చాలా మందికి మొక్కలని పెంచడం అంటే ఎంతో ఇష్టం. రకరకాల మొక్కల్ని ఇంట్లో వేస్తూ ఉంటారు మీరు కూడా మీ ఇంట్లో అన్ని రకాల మొక్కల్ని పెంచుతూ ఉంటారా..? వాటిల్లో తమలపాకు మొక్క కూడా ఉందా.. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.. చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది తమలపాకు మొక్క ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని.. తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే శుభమా అశుభమా అని మీకు సందేహం ఉంటే ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి.
తమలపాకుని మనం పూజల్లో వాడుతూ ఉంటాము తమలపాకు లేకుండా పూజ జరగదు. నిజానికి తమలపాకు చాలా మేలు చేస్తుంది. అందులో 27 గుణాలు ఉంటాయి. అయితే దేవుడికి తాంబూలం ఎందుకు ఇస్తామంటే నా సర్వ లక్షణం నీదే అని చెప్పి దేవుడికి తాంబూలముని ఇస్తూ ఉంటాము. దేవుడు ఆశీస్సులు మన మీద ఉంటాయని తమలపాకుతో తాంబూలాన్ని సమర్పిస్తూ ఉంటాము. అందుకనే చాలా మంది తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుతుంటారు.
ఆయుర్వేదం ప్రకారం తాంబూలంలో కూడా 24 లక్షణాలు ఉన్నాయి. కొన్ని విచిత్రమైన రోగాలని కూడా తమలపాకు నయం చేస్తుంది. కేవలం మన దేశం మాత్రమే కాకుండా ఇతర దేశాలు వాళ్ళు కూడా తాంబూలం పొడిని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రాచీన కాలం నుండి తమలపాకు కి ఎంతో విశిష్టత వుంది. ఎన్నో వాటికి తమలపాకు పనిచేస్తుంది. తమలపాకు మొక్కని ఇంట్లో ఉంచుకోవడం తప్పుకాదు. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల దేవతల ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి.
అయితే తులసి కోటను ఎలా అయితే మనం పవిత్రంగా భావిస్తామో ఎలా అయితే గౌరవంగా చూస్తామో తమలపాకు మొక్కని తమలపాకు వృక్షాన్ని కూడా అంతే పవిత్రంగా అంతే గౌరవంగా చూసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు మొక్కలో చేతులు కడుక్కోకూడదు ఏ మొక్కలో అయినా చేతులు కడుక్కోవచ్చు కానీ తులసి తమలపాకు ఇటువంటి మొక్కల్లో చేతులు కడుక్కోవడం మంచిది కాదు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…