Wealth : చాలా మంది ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎంతో సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన సంపద అంతా కూడా మంచి నీళ్లలా ఖర్చు అయిపోవడం లేదంటే సంపదని కోల్పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే సంపద నశించడానికి ముఖ్య కారణాలు ఇవే.. ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది మీ సంపద అలానే ఉంటుంది.
చాలా మంది పసుపు కుంకుమ రాసిన గుమ్మం మీద కాలును మోపి ఆ ఇంట్లోకి వెళుతూ ఉంటారు ఈ తప్పును చేస్తే కచ్చితంగా సంపద పోతుంది. ఈ పొరపాటును ఎప్పుడూ కూడా ఎవరూ చేయకూడదు. అదే విధంగా బీరువా తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం తాళం వేయకుండా అలా వదిలేయడం వంటివి చేస్తే కూడా సంపద ని కోల్పోవాల్సి ఉంటుంది. కనుక ఈ తప్పును కూడా ఎప్పుడు చేయకండి.
మాసిన బట్టల్ని అస్సలు బీరువాలో పెట్టకండి మాసిన బట్టలని బీరువాలో పెట్టడం వలన మీ సంపద తరిగిపోతుంది. ఉగాది పర్వదిన రోజున గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం లభించదు. ఖర్చులు ఎక్కువైపోతాయి. సంపద పోతుంది. ఇంటి గృహిణి గా ఉండే స్త్రీ గాజులని వేసుకోక పోతే అప్పులు బాగా పెరిగిపోతాయి. కాలి చెప్పులని ఇంట్లో పెట్టినా సింహద్వారానికి ఎదురుగా ఉంచినా కూడా సంపద మొత్తం పోతుంది.
తడి కాళ్ల తో మంచం మీద నిద్రపోతే అప్పులు బాగా పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలానే ఇంటికి వచ్చిన బిచ్చగాడికి ఆహారం అందించకపోయినా మూగజీవికి ఆహారం పెట్టకపోయినా ఏడు జన్మల దరిద్రం అనుభవించాల్సి ఉంటుంది. గురువులను అవమానించినా దూషించినా దోషము కలిగి సంపద మొత్తం పోతుంది ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…