తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేపిన సంగతి మనకు తెలిసిందే. కేవలం కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంగా అమృత తల్లిదండ్రులు నడిరోడ్డుపై అతి దారుణంగా చంపిన ఘటన ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదులుతోంది. ఇదిలా ఉండగానే ఉత్తరప్రదేశ్లో మరో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న కారణంతోనే వధువు తల్లిదండ్రులు వరుడిని అతి కిరాతకంగా చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
గోరఖ్‌పూర్‌కు చెందిన అనీష్ కుమార్ చౌదరి, దీప్తి మిశ్రా అనే యువతి యువకులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి విషయం పెద్దల ముందు తెలపడంతో దీప్తి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే అనీష్ దీప్తి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.దీంతో తమ ఇంటి పరువు పోయిందని భావించిన దీప్తి కుటుంబ సభ్యులు పెళ్లి జరిగిన మూడు నెలల వరకు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్లాన్ ప్రకారమే కొద్ది రోజుల క్రితం నడిరోడ్డుపై వెళ్తున్న అటువంటి అనీష్ కుమార్ ను దీప్తి తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. తన భర్త చావుకు కారణం తన తల్లిదండ్రులేనని దీప్తి చేసిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనీష్, దీప్తి ఇద్దరు ఉన్నత చదువులు చదివి ఇద్దరు గ్రామపంచాయతీ అధికారులుగా ప్రభుత్వ కొలువులను సాధించారు. ఇద్దరూ ఒకే చోట పని చేయటం వల్ల వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న వీరి జీవితంలో ఇలాంటి ఘటన ఎదురైందని దీప్తి కన్నీరుమున్నీరయ్యారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…