గుత్తి వంకాయలతో సహజంగానే చాలా మంది కుర్మా చేసుకుంటారు. కొందరు వాటిని టమాటాలతో కలిపి వండుతారు. అయితే నిజానికి ఆ వంకాయలతో బిర్యానీ చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. చికెన్ బిర్యానీ స్టైల్‌లో దాన్ని చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే గుత్తి వంకాయ బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అనాస పువ్వు, లవంగాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, మిరియాలను గ్రైండ్ చేసుకోవాలి. రెండు గ్లాసుల బాస్మతి బియ్యం కడిగి పక్కన ఉంచుకుని, ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అందులో ఆరు లవంగాలు, నాలుగు యాలక్కాయాలు, రెండు బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి ముద్ద, దాల్చిన చెక్క, షా జీరా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయాలి.
బాగా కాగాక బాస్మతి బియ్యం వేసి 3/4 వంతు ఉడికాక చిల్లుల గిన్నెలోకి వంచాలి. బిర్యానీ వండే గిన్నె కింద మట్టు వంపు లేని సమంగా ఉండేది బాగుంటుంది. మట్టు కింద పల్చగా వుంటే కింద పెనం పెట్టు కోవచ్చు. కోసిన వంకాయలలో కొంచెం కొంచెం మసాలా పెట్టి మూకుడు లో నూనె పోసి కాగాక వంకాయలు వేసి నెమ్మదిగా కొద్దిగా వేపాలి. బిర్యానీ వండాల్సిన గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి కొన్ని వేగిన వంకాయలు, మసాలా, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా వేపి ఉల్లి పాయ ముక్కలు వేసి ఉడికిన అన్నం కొద్దిగా పరచాలి. తరువాత మిగిలిన వంకాయలు మసాలా వేసి పుదీనా, కొత్తిమీర, ఉల్లి ముక్కలు వేయాలి. కొద్దిగా నెయ్యి పైన అంతా వేయాలి. సరిపోయే మూతని పెట్టి బరువుగా ఉండే కల్వం పెడితే గోధుమ పిండితో మూత మూయనవసరం ఉండదు. గ్యాస్ సిమ్ లో 20 నిమిషాలు ఉంచితే గుత్తి వంకాయ బిర్యాని రెడీ అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…