సాధారణంగా కొందరు దొంగలు బంగారు దుకాణాలలో దొంగతనాలకు పాల్పడ్డటం మనం చూస్తుంటాము. అయితే ఈ విధమైనటువంటి దొంగతనాలు రాత్రిపూట జరగడం సర్వసాధారణం. కానీ ఓ బార్యాభర్తలు పట్టపగలే గన్నులతో బెదిరించి బంగారు దుకాణంలో నగలను దోపిడీ చేసి దుకాణంలో ఉన్న నగలను బ్యాగ్లో సర్దారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బంగారు దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుజరాత్ అహ్మదాబాద్ లో ఓ జంట ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డారు.ఈ వీడియోలో భర్త దుకాణంలో ఉన్నటువంటి సిబ్బందికి గన్నుతో బెదిరించ గా భార్య సుత్తితో అద్దాలను పగులగొట్టి అక్కడున్న నగలను తన బ్యాగులో సర్ది పెట్టుకుంది.
A couple in Ahmedabad attempted to rob a jewellery shop taking cue from a South film. They used a toy gun and a knife to scare the staff. Later they apologized fearing getting caught. Now under arrest
VC: Ahmedabad Police #Robbery #UserGenerated (@gopimaniar) pic.twitter.com/O2wY253Wj7— IndiaToday (@IndiaToday) June 30, 2021
చివరికి దుకాణంలో ఉన్నటువంటి సిబ్బంది ఆ భార్యాభర్తలపై తిరగబడ్డారు. ఈ క్రమంలోనే వారి దగ్గర ఉన్నటువంటి గన్ లాక్కొని వారిని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో భాగంగా ఆ భార్యాభర్తలు వారికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగానే ఈ విధమైనటువంటి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.