మీరు స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ టీవీ లేదా ఏసీలు కొనాలని భావిస్తున్నారా.. నిజంగా మీకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అయితే వీటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వారికి భారీ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ ఫోన్,స్మార్ట్ టీవీ, అప్పరెల్, గ్రాసరీస్ వంటి వాటిపై ఎక్కువ తగ్గింపు లభిస్తుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల పై మ్యానుఫ్యాక్చరింగ్ , ట్రాన్స్ పోర్ట్ పెరిగిన కూడా వీటి ధరలను భారీగా తగ్గించడం గమనార్హం.కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే ఎన్నో నష్టాలలో ఉన్న కంపెనీలు ఈ విధంగా ఆఫర్లతో సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్ఎంసీజీ కంపెనీలు భారీ తగ్గింపు అందించే ఛాన్స్ ఉందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈకామర్స్ సంస్థల అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న స్మార్ట్ ఫోన్లు గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ తగ్గింపు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో స్మార్ట్ ఫోన్ పై ఏకంగా పది శాతం తగ్గింపు పొందవచ్చని.కేవలం స్మార్ట్ఫోన్లపై మాత్రమే కాకుండా ఏసీల పై కూడా భారీ తగ్గింపు ధరలతో మీ సొంతం చేసుకోవచ్చు.