హైదరాబాద్ లో విషాదం నెలకొంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోలింగ్ షట్టర్ బలితీసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఒక ద్విచక్ర వాహనం షోరూం లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఒక ద్విచక్ర వాహనం షోరూం లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఆ షో రూమ్ కు రోలింగ్ షట్టర్ ఉంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం యధావిధిగా షట్టర్ తెరిచారు.
ఈ క్రమంలోనే అదే సమయంలో అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి అర్జున్ కొడుకు రాజేష్ ఆ రోలింగ్ షట్టర్ లో ఇరుక్కొని పోయాడు.ఈ విధంగా రోలింగ్ షట్టర్ లో ఇరుక్కున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో హడావిడిగా అక్కడున్న అటువంటివారు రోలింగ్ షట్టర్ దించి అందులోనుంచి బాలుడిని బయటకు తీయడంతో అప్పటికే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన తన కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రాజేష్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు.అయితే ఇదంతా కేవలం షాపు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతుందని పలువురు వ్యక్తం చేశారు.
ఇదివరకే ఇక్కడ వాచ్ మెన్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి కూతురికి కూడా కరెంట్ షాక్ తగిలిందని అయితే తన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడింది అని పలువురు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందోనని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…