తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి లో ఫార్మాసిటీ కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఇంటికొక ఉద్యోగం దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఈ ఫార్మాసిటీ కోసం రైతులకు నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తామని తెలిపింది.
ఈ క్రమంలోనే పది ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి శిక్షణ తరగతులను ప్రారంభించారు. రెండు నెలల పాటు శిక్షణ అనంతరం వీరిని విధుల్లోకి తీసుకొనున్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది.ఈ క్రమంలోనే మొదటి బ్యాచ్ కింద 120 మంది యువతను ఎంపిక చేసి వారికి సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే యువత విద్యార్హతల ఆధారంగా ఆయా కోర్సుల్లో టీఎస్‌ఐఐసీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. క్వాలిటీ కంట్రోలర్, డ్రైవింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రొడక్షన్ ఆపరేటర్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వివిధ పనుల కోసం యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రెండు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం వీటిని విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ శిక్షణ లో భాగంగా వీరికి ఒక పూట భోజనంతో పాటు వెళ్లి రావడానికి ట్రాన్స్ పోర్ట్ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుందని తెలిపారు ఈ శిక్షణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…