Toll Plaza : జాతీయ రహదారుల మీదే కాదు, రాష్ట్ర ప్రధాన రహదారుల మీద ప్రయాణించేటప్పుడు సహజంగానే టోల్ ప్లాజాలు వస్తుంటాయి. రోడ్డును నిర్మించే కంపెనీలు కొన్నేళ్ల పాటు టోల్ ప్లాజాలు పెట్టి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే జాతీయ రహదారులపై ఇక మీదట టోల్ ప్లాజాలు ఉండవు. వాటిని తొలగించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వివరాలను వెల్లడించారు.
దేశంలోని జాతీయ రహదారులపై త్వరలో టోల్ ప్లాజాలు ఉండవని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ క్రమంలోనే టోల్ ప్లాజాలను తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు గాను కొత్త పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే 3 నెలల్లోనే ఈ పాలసీ అమలులోకి వస్తుందని, దీంతో టోల్ ప్లాజాలను తొలగించడం సులభతరం అవుతుందని తెలిపారు.
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు బదులుగా జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. గతంలో నగదు తీసుకునేవారు.
ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద నగదు తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చేవి. ట్రాఫిక్ బాగా జామ్ అయ్యేది. కానీ ఫాస్టాగ్ వచ్చాక టోల్ వసూలు సులభతరం అయింది. అయితే టోల్ ఫీజు వసూలును ఇంకా సులభతరం చేసేందుకు జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు.
జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ద్వారా వాహనాల నుంచి ఆటోమేటిగ్గా టోల్ వసూలు చేస్తారు. వాహనం టోల్ ప్లాజా గుండా వెళితే ఆటోమేటిగ్గా టోల్ వసూలు అవుతుంది. ఇక ఇందుకు గాను ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుకోవడం తప్పనిసరి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సిస్టమ్‌కు చెందిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. అందువల్ల త్వరలోనే టోల్ ప్లాజాల వద్ద సమస్యలకు చెక్ పడనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…