భార్య భర్తల బంధం ఎంతో గొప్పదని చెబుతుంటారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటూ జీవితం ఎంతో అన్యోన్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ప్రస్తుత తరుణంలో భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు కొట్లాటలకు దారితీస్తూ.. క్షణికావేశంలో చంపుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఎంతోమంది ఇలా హత్యకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని దుర్గా భవానీనగర్‌ను ఆనుకొని ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ బిల్డర్ వద్ద చత్తీస్‌ఘడ్‌కు చెందిన అటల్ పార్థి, రేఖా పార్థి అనే దంపతులు కొంత కాలం నుంచి అక్కడే పని చేస్తున్నారు. అయితే వీరి మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తుండేవి. దీంతో ఇరువురు పోట్లాడుకుని ఆ తరువాత మామూలుగా ఉండేవారు.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. అటల్ పార్థి తన భార్య రేఖను హత్యచేసి అదే కాంపౌండ్ గోడ పక్కన గడ్డిలో చుట్టి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…