తల్లి ఉందన్న ధైర్యంతో ఆ కొడుకు రాత్రంతా తన తల్లి పక్కనే పడుకున్నాడు. అయితే తన తల్లి మరణించిందనే విషయం తెలియక ఆ కొడుకు రాత్రంతా తల్లి చెంత పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం ఆ కొడుకు లేచి తన తల్లిని నిద్రలేపాడు. అయితే ఎంత సేపటికీ ఆమె నిద్ర లేకపోవడంతో ఎంతో కంగారుపడిన ఆ బాలుడు తన తల్లి మరణించిందనే విషయం తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అతను రోధిస్తున్న ఘటన అందరినీ కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అశ్వారావుపేట టౌన్ సంతపాకలో నిర్మల (45), కొడుకు కృష్ణ(7)తో కలసి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నిర్మల ఎలాంటి వైద్యం చేయించుకోకుండా ఉండటమే కాకుండా, తీవ్రమైన చలి, వర్షానికి ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి పోయింది. దీంతో తన కొడుకు కృష్ణను తన పక్కన పడుకోబెట్టుకుని రాత్రికి రాత్రి నిద్రలోనే మరణించింది.
అయితే తన తల్లి పక్కన పడుకున్నానన్న ధైర్యంతో ఆ బాలుడు తెల్లవారే వరకు తన తల్లి చెంత నిద్ర పోయాడు. ఉదయం కృష్ణ నిద్రలేచి తన తల్లిని నిద్ర లేపగా తన తల్లి లేవకపోవడంతో కంగారుగా చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియజేశాడు. ఈ క్రమంలోనే స్థానికులు ఆమె మరణించిందని వార్త చెప్పడంతో కృష్ణ ఎంతో రోదించాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఆధార్ కార్డులు తీసుకొని వారి బంధువులకు సమాచారం అందించారు. అయితే తన తల్లి మరణించిందనే వార్త తెలియకుండానే తెల్లవార్లూ తన తల్లి చెంత పడుకున్న కృష్ణను చూసి అక్కడున్న వారందరూ కన్నీరు పెట్టుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…