కేరళలోని గత రెండు రోజుల క్రితం వరకట్న వేధింపులకు బలైన యువతి విస్మయ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకు ఈ కేసు తీవ్ర మలుపులు తిరుగుతోంది. విస్మయ అత్తింటివారు తనని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కారణంగా ఆత్మహత్య చేసుకుందని అందరూ ముందుగా భావించినప్పటికీ, అది ఇది ఆత్మహత్య కాదు హత్య అని తాజాగా హత్య కేసుకు సంబంధించిన పలు విషయాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కుమార్‌కు, విస్మయ వి నాయర్(23) అనే యువతికి మార్చి 2020లో పెద్దల సమక్షంలో వివాహమైంది. అల్లుడు ఆర్టీఏలోపని చేస్తుండడంతో తనకు గొప్ప సంబంధం వచ్చింది అని భావించిన తండ్రి తనకు కట్నకానుకలు పెద్ద ఎత్తున ఒక చెప్పాడు. కూతురి కోసం ఒక ఎకరా పొలం, ఒక కారు, వంద తులాల బంగారాన్ని ఇచ్చి కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన విస్మయకు అత్తారింట్లో తీవ్ర వేధింపులు ఎదురయ్యాయి.తన భర్త కిరణ్ తనకు కారు కాకుండా డబ్బులు కావాలని, విస్మయను వేధించేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి పుట్టింటికి వెళ్ళిన విస్మయ పై కిరణ్ చేయి చేసుకోవడంతో వారిరువురి మధ్య గొడవలు జరిగి తన కూతురిని తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత విస్మయ పరీక్షల నిమిత్తం హాస్టల్ కి వెళ్లగా అక్కడి నుంచి భర్త కిరణ్ ని బలవంతంగా వారి ఇంటికి తీసుకెళ్లాడు.
అత్తారింటికి వెళ్ళిన విస్మయ చిత్రహింసలు ఎక్కువయ్యాయి. కేవలం తన తల్లితో మాత్రమే మాట్లాడేదని అక్కడ తనకి ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తమతో చెప్పకుండా కేవలం అమ్మతో మాత్రమే చెప్పేదని విస్మయ సోదరుడు తెలిపాడు.జూన్ 19న తన కజిన్‌కు భర్త ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడో చెబుతూ మెసేజ్ చేసింది. తనని కొట్టడంతో తన మొహం పై గాయాలయ్యాయని,ఆ ఫోటోలను తన అన్నకు వాట్సప్ చేసి ఎవరికీ చొప్పదంటు మెసేజ్ చేసినట్టు తెలిపాడు.
ఈ ఘటన జరిగిన రెండు రోజులకే విస్మయ ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిందని తనని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చామని కిరణ్ తనకు ఫోన్ చేశారని విస్మయ సోదరుడు తెలిపారు. ఇది ఆత్మహత్య కాదు హత్య అని, అదనపు కట్నం కోసమే విస్మయను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, వారికి సరైన శిక్ష వేయాలని విస్మయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయ హత్య కేసులో నిజాలు బయటపడటంతో కేరళ మొత్తం నిందితులకు శిక్ష పడాలని పెద్ద ఎత్తున మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.