టీచర్లు మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పుతూ మనల్ని సక్రమైన మార్గంలో పయనించేలా చేస్తారు. మనం ప్రస్తుతం ఒక గొప్ప డాక్టర్, ఇంజనీర్ వంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాము అంటే దాని వెనుక టీచర్ అనే వ్యక్తి ఉండడంతోనే మనం ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాము. మనకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్లు మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దే బాధ్యత వారికి ఉంటుంది. అలాంటి తప్పులను సరిదిద్దే ప్రయత్నమే ఆ ఉపాధ్యాయుడు చేయగా ఆ ఉపాధ్యాయుడికి సదరు విద్యార్థి నుంచి చేదు అనుభవం ఎదురయింది.
ఢిల్లీలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఒక విద్యార్థి టీచర్ పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో చదివే లతీఫ్ అనే విద్యార్థి ఇప్పటికే రెండు సార్లు ఇంటర్ ఫెయిల్ అవడంతో మొదటి సంవత్సరంలోనే కూర్చుని చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్న సమయంలో లతీఫ్ తరగతి గదిలో ఇష్టానుసారంగా కూర్చోవడం వల్ల ఉపాధ్యాయుడు అతనికి సరిగ్గా కూర్చోమని చెప్పాడు.
ఉపాధ్యాయుడు తనకు ఈ విధంగా చెప్పడంతో లతీఫ్ ఎంతో ఆగ్రహానికి గురై అక్కడే ఉన్న ఒక ఐరన్ రాడ్ తీసుకొని టీచర్ తలపై బాదాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లతీఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…