Santhosh Kumar Jaiswal : ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు విచారణలో తేలింది. అతని వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సంతోష్ కుమార్ జైశ్వాల్ అనే వ్యక్తి నగర్ కొట్వలి అనేప్రాంతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో శానిటేషన్ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతనిపై వచ్చిన పలు ఫిర్యాదుల కారణంగా విచారణ చేపట్టిన కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రాకు దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు తెలిశాయి.
విచారణలో భాగంగా సంతోష్ కుమార్ జైశ్వాల్‌ను ప్రశ్నించగా అతను దోషిగా తేలింది. దీంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. స్థానిక తహసీల్దార్ దేవేంద్ర యాదవ్ ను అతని కేసును విచారించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా విచారణలో భాగంగా సంతోష్ కుమార్‌కు చాలా ఖరీదైన కార్లు మొత్తం 9 ఉన్నాయని తేలింది. వాటిల్లో స్విఫ్ట్ డిజైర్, మారుతి సుజుకి ఎర్టిగా, మహింద్రా స్కార్పియో, టొయోటా ఇన్నొవా, మహింద్రా జైలో వంటి కార్లు ఉన్నట్లు వెల్లడైంది.
సంతోష్ కుమార్ సోదరుడు ఉమాశంకర్ జైశ్వాల్‌కు ఒక మారుతి సుజుకి ఎర్టిగా, అతని భార్య బేబీ జైశ్వాల్‌కు ఒక టొయోటా ఇన్నొవా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా సంతోష్ కుమార్ జైశ్వాల్ బాగోతం వెలుగులోకి రావడంతో అతనికి ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, బ్యాంకుల్లో లేదా బ్యాంకు లాకర్లలో ఎంత డబ్బు, బంగారం దాచి ఉంచాడనే విషయంపై కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. త్వరలోనే మొత్తం వివరాలను ప్రకటించనున్నారు. కానీ సంతోష్ కుమార్‌కు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు మాత్రం చూచాయగా అధికారులు వెల్లడించారు.
అయితే సంతోష్ కుమార్ కుమార్ జైశ్వాల్ ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ అన్ని కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టాడు అనే విషయంపై అధికారులు నోరెళ్లబెడుతున్నారు. అతను మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో పలు ముఖ్యమైన ఫైల్స్, పత్రాలను ఫోర్జరీ చేశాడని, అలాగే కొన్ని పత్రాలు, ఫైల్స్ మిస్ అయ్యాయని, అందువల్లే అవినీతి పరులు, అక్రమార్కులతో లాలూచీ పడి అన్ని కోట్లను అతను సంపాదించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు బయట పడ్డ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…