Brahmanandam : ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. ఒకప్పటిలా కాదు. ఇప్పుడు అంతా వేగమే. ఏ రంగంలో చూసినా అన్నింటిలోనూ ప్రజలు వేగం కోరుకుంటున్నారు. అంతెందుకు.. మనకు ఒకప్పుడు మొబైల్ ఫోన్లే ఉండేవి కావు. కానీ ఇప్పుడు వాటిల్లో ఏకంగా 5జి ఇంటర్నెట్ సేవలను అత్యంత వేగంగా పొందుతున్నాం. ఒకప్పుడు ఇంటర్నెట్ సేవలను వాడుకోవాలంటే మనకు సమీపంలో ఉన్న ఇంటర్నెట్ కెఫెల దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు.. మీట నొక్కితే చాలు, ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ప్రత్యక్షం అవుతుంది.
అయితే అన్ని రంగాల్లోనూ వేగంగా పనులు జరుగుతున్నాయి కనుక నేటి తరం యువత కూడా తాము చేస్తున్న పనుల్లో వేగాన్నే కోరుకుంటున్నారు. చేసే జాబ్ ఏదైనా లేదా వ్యాపారం అయినా సరే చాలా త్వరగా డెవలప్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే వేగం పనికిరాదని, కొన్ని సార్లు చాలా కష్డపడాల్సి ఉంటుందని సీనియర్ కమెడియన్, నటుడు బ్రహ్మానందం అన్నారు. ఈ మధ్యనే ఆయన ఒక చోట నేటి తరం యువత గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం యువతకు తొందరెక్కువన్నారు. ఏది కావాలన్నా వెంటనే జరిగిపోవాలని కోరుకుంటున్నారని, అలాగే సక్సెస్ కూడా త్వరగా రావాలని ఆశిస్తున్నారని అన్నారు.
అయితే సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదని, చాలా సార్లు ఫెయిల్ అయితేనే సక్సెస్‌ను అందుకోగలమని అన్నారు. లక్ ఉన్న కేవలం కొందరు మాత్రమే అతి తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, కానీ ఒక సాధారణ పౌరుడికి మాత్రం కొన్ని ఏళ్లకు ఏళ్లు శ్రమ అవసరమని అన్నారు. అయితే బ్రహ్మానందం చెప్పిన మాటలను యూత్ చెవికెక్కించుకుంటారో లేదో తెలియదు కానీ.. ఆయనను మాత్రం మీమ్స్ రూపంలో చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. అందుకనే ఆయన ఈ సలహా ఇచ్చారు కాబోలు. మరి యువత పాటిస్తారో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…