Renu Desai : ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తనకు తోచినంతలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. ఈమె స్వతహాగా జంతు ప్రేమికురాలు. కనుక వాటికి ఏమైనా అయితే ఈమె తట్టుకోలేరు. ఇక సమాజంలో జరిగే సంఘటనలపై కూడా ఈమె స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా కోల్‌కతా ఘటనపై కూడా రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కేర్ మెడికల్ కాలేజీలో ఓ పీజీ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై యావత్ దేశం కదిలింది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా రేణు దేశాయ్ కూడా ఇదే సంఘటనపై కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆమె ఏమన్నారంటే..
మీ కొడుకుకు మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించండి. ఎందుకంటే నేరు కూడా నా కుమార్తెకు ఎముకలు విరగ్గొట్టడం నేర్పించబోతున్నాను.. అంటూ రేణు దేశాయ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా రేణు దేశాయ్ తాను పెట్టిన పోస్ట్‌కు బ్యాక్ గ్రౌండ్‌లో కరాటే నేర్పిస్తున్న ఫొటోను యాడ్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ నెట్టింట అందరినీ ఆలోచింపజేస్తోంది.
కాగా రేణుదేశాయ్ ఇప్పటికే కోల్‌కతా ఘటనపై స్పందించారు. సదరు సంఘటన తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. సమాజంలో మహిళలకు రోజు రోజుకీ భద్రత, రక్షణ కరువవుతుందని విచారం వ్యక్తం చేశారు. అలాంటి మానవమృగాలను కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…