ఈ ప్రపంచంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే మహిళలకు రక్షణ కరువైంది. రోజురోజుకు ఇలాంటి అత్యాచారం కేసులు ఎక్కడో ఒక చోట నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది. పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్‌ను ఆమె స్నేహితులే ఎంతో దారుణంగా చంపిన ఘటన చోటు చేసుకుంది.
నూర్ ను అతి దారుణంగా పొట్టనబెట్టుకున్న ప్రధాన నిందితుడు మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు చేసిన ప్రకటనతో పాక్ అట్టుడికిపోతోంది. ఈ క్రమంలోనే మహిళలు పెద్ద ఎత్తున ప్లకార్డులు చేతబట్టి రోడ్డు పైకి దిగి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే #justicefornoor అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్‌ను మంగళవారం రాత్రి ఇస్లామ్‌బాద్ సెక్టార్ ఎఫ్-7/4లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. ఈమె హత్యకు గురైన ఇల్లు తన స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్‌ది కావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే హత్యకు గురైన నూర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్ట్ మార్టంలో డాక్టర్లు ఆశ్చర్యపోయే ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలోనే వైద్య అధికారులు మాట్లాడుతూ.. బ్రతికుండగానే ఆమెను ఎంతో చిత్ర వధ చేశారు. సూదులతో శరీరంపై పొడిచారు, జుట్టు మొత్తం కత్తిరించారు. బ్రతికుండగానే తనని తగలబెట్టి ఆపై పదునైన కత్తితో పీక కోసి చంపారని వైద్యులు వెల్లడించారు. ఈ విధంగా ఒక ఒక యువతి పట్ల దారుణంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా పాక్ ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే తనకు న్యాయం జరగాలంటూ, నిందితులకు కఠిన శిక్ష పడాలని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ పరిస్థితులలో జకీర్‌ను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…