TDP Situation: ఏపీలో సీఎం జగన్ ప్రభంజనం మొదలైనప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే వైకాపాయే ఘన విజయం సాధిస్తూ వస్తోంది. ఇక తాజాగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైపీసీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఈ ఏడాది మార్చి 10నే జరిగాయి. అయితే కోర్టు వివాదాల కారణంగా ఫలితాలు తాజాగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీకి ఏకంగా 47 సీట్లు రాగా టీడీపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. జనసేన, బీజేపీలకు సీట్లు దక్కలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరులో టీడీపీ 68,175 ఓట్లో 42 శాతం ఓట్లను సాధించగా ఇప్పుడది 28 శాతానికి పడిపోయింది. తాజాగా ఆ పార్టీకి 37,414 ఓట్లు వచ్చాయి. అదే క్రమంలో వైకాపాకు 2019లో 44.73 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 56.43 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్యలను బట్టి చూస్తే టీడీపీ డౌన్ ఫాల్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి టీడీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను చురుగ్గానే పోషిస్తోంది. అనేక రకాల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రజలు ఆ పార్టీని ఓన్ చేసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. వినిపించడమే కాదు, ఎన్నికల ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ డౌన్ ఫాల్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముందు ముందు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…