ఈ ప్రపంచంలో అమ్మతనం కన్నా గొప్పది ఏది ఉండదు అంటారు. తనపేగు తెంచుకుని పుట్టిన బిడ్డపట్ల ఆ తల్లి చూపే ప్రేమ అనురాగాలు అమితమైనవి.తన బిడ్డ కడుపు నింపడం కోసం ఆతల్లి పస్తులుండిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అయితే పేగు తెంపుకొని పుట్టిన బిడ్డపట్ల కసాయిగా ప్రవర్తించే తల్లులు కూడా ఉంటారని పంజాబ్ లో జరిగిన ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. భర్త పై ఉన్న కోపంతో బిడ్డకు విషమిచ్చి చంపిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కపుర్తాలా పరిధిలోని హశువల్ గ్రామానికి చెందిన హర్జీత్ సింగ్, సారాబ్జిత్ కౌర్‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. వీరిలో పెద్దబ్బాయి పేరు అవిజోత్ సింగ్. ఎంతో హాయిగా సాగిపోతున్న ఈ సంసారంలో పలు గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోని ఈ దంపతులు కొత్తగా నిర్మించిన ఇంటి విషయంలో వీరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ తరచూ గొడవ పడేవారు.
ఈ గొడవల కారణంగా మానసికంగా కృంగిపోయిన సారాబ్జిత్ తన భర్త పై కోపంతో తను ఇంట్లో లేని సమయం చూసి. తన పెద్ద కొడుకు అవిజోత్ కి అన్నంలో విషం కలిపి బలవంతంగా తనకు తినిపించింది. అయితే విషం కలిపిన అన్నం తినటం వల్ల అపస్మారక స్థితిలో ఉన్న తనకొడుకుని చూసి ఏం జరిగిందోనని హర్జీత్ సింగ్ గ్రామ సర్పంచి వద్దకు పరుగులు పెట్టి తన కారులో తన కొడుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.అసలు బాలుడు ఏ విధంగా మృతిచెందాడని ఆరా తీయగా స్వయంగా తన తల్లి కొడుకు విషం కలిపిన అన్నం తినిపించిందని తెలియడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…