కరోనా వ్యాధిని అరికట్టాలంటే తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి అనే విషయం మనందరికీ తెలిసిందే. సామాజిక దూరం పాటిస్తూ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడే మనం ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండగలవు. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం మొదట్లో ఎవరు ముందుకు రాలేదు. అందుకు కారణం వ్యాక్సిన్ పై పలు అపోహలు ఉండటమే.అయితే వ్యాక్సిన్ పట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుసుకోవడంతో వ్యాక్సిన్ కోసం ఎక్కువగా పోటీ పడుతున్నారు.ఎంతలా అంటే ఏకంగా థియేటర్ల వద్ద సినిమా టికెట్ల కోసం ఏ విధంగా అయితే కొట్టుకుంటారో ఆ విధంగా వ్యాక్సిన్ కోసం కొట్టుకుంటున్న ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా బీహార్.. చాప్రా జిల్లాలో ఎక్మా హాస్పిటల్ ఆవరణంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్న క్రమంలో మహిళలని సామాజిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడమన్నారు.అయితే అక్కడ సామాజిక దూరం కనిపించకపోవడం ఏమో గాని మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ చివరకు కొట్టుకొనే స్థాయి వరకు వెళ్లారు.ఇక చివరికి ఒకరికొకరు జుట్టు పట్టుకుని కొట్టుకోవడంతో అక్కడే ఉన్నటువంటి వారిలో టెన్షన్ మొదలైంది.
ఈ క్రమంలోనే మహిళలను విడిపించడానికి వెళ్లిన వారిని కూడా చితకబాదడంతో ఎవరు ఆ గొడవలోకి చోటు చేసుకోలేదు.సామాజిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్లు వేయించుకున్నప్పుడే కరోనా వ్యాప్తిని అదుపు చేయవచ్చు కానీ, ఇలా ఇలా ఒకరికొకరు పోట్లాడుకుంటూ వ్యవహరిస్తే మాత్రం కరోనా ఉద్ధృతికి కారణం అవుతామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…