చెయిన్ స్నాచింగ్‌లకు పాల్పడడం దొంగలకు కొత్తేమీ కాదు. వారు అవలీలగా ఆ పని చేస్తుంటారు. నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా మహిళ కనిపిస్తే బైక్ మీద వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని వెళ్తారు. అయితే ఆ దొంగలు కూడా అలాగే చేయబోయారు. కానీ వారిలో ఒక వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అయితే అప్పటికే అతను ఆ గొలుసును మింగేశాడు. దీంతో పోలీసులు చాకచక్యంగా ఆ గొలుసును బయటకు తీశారు.
బెంగళూరులోని కేఆర్ మార్కెట్ ప్రాంతంలో ఎంటీ స్ట్రీట్‌లో రాత్రి 8.50 గంటల ప్రాంతంలో హేమ అనే మహిళ రహదారిపై వెళ్తోంది. అయితే ఆమె దగ్గరకు వచ్చిన ముగ్గురు దొంగలు ఆమె మెడలో ఉన్న 70 గ్రాముల బంగారు గొలుసును దొంగించాలని చూశారు. వారిలో విజయ్ అనే వ్యక్తి గొలుసును దొంగిలించాడు. కానీ ఆమె గొలుసును గట్టిగా పట్టుకుని పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టూ ఉన్నవారు అక్కడికి వచ్చారు.
అయితే అప్పటికే ఇద్దరు దొంగలు పారిపోయారు. విజయ్ ఒక్కడే మిగిలాడు. ఈ క్రమంలో అతను భయపడి గొలుసును మింగేశాడు. అతన్ని అందరూ పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే అతన్ని జనాలు చితకబాదారు. దీంతో పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఎక్స్‌రే గట్రా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది.
పోలీసులకు మొదట అతను గొలుసు మింగినట్లు తెలియదు. కానీ ఎక్స్‌రే లో తెలిశాక వారు తమదైన శైలిలో విచారణ చేశారు. అతను గొలుసు మింగినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు వైద్యుల సహాయంతో లాక్సేటివ్‌లు, అరటి పండ్లను విజయ్‌కు తినిపించి అనంతరం గొలుసును మలం ద్వారా బయటకు తీయించారు. దాన్ని యజమానురాలికి అప్పగించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…