ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన 3 నెలల పసికందును చిదిమేశాడు. ఢిల్లీలోని సమతా విహార్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీలోని సమతా విహార్‌లో నివాసం ఉంటున్న రవి రాయ్ (26) గత కొంత కాలంగా ఎలాంటి పనిచేయకుండా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య సమీపంలో ఉన్న ఆదాజ్‌పూర్ మండీలో ఉద్యోగం చేస్తోంది. అయితే వారు సమతా విహార్‌కు ఒక నెల కిందటే వచ్చారు.
ఏ పని చేయకుండా ఇంట్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఉద్యోగం వెదుక్కోమని భార్య రోజూ చెబుతుండేది. దీంతో ఇద్దరికీ కొంత కాలంగా రోజూ గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు వీరు గొడవపడ్డారు. అయితే పట్టరాని కోపం వచ్చిన రవి తన 3 నెలల కుమారున్ని గోడకేసి బలంగా కొట్టాడు.
ఈ క్రమంలో ఆ పసికందు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. తల్లి ఇరుగు పొరుగు సహాయంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి రవి రాయ్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…