RRR : రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు టాప్ హీరోలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా, ఇది సినీ ప్రేక్షకుల మతులు పోగొడుతోంది. రాజమౌళి ఈ సినిమాతోనూ తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేయనున్నాడని అంటున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ట్రైలర్‌కు తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్, లైకులు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది. దీంతో చాలా సినిమాల రికార్డులు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ, ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పవన్ నటించిన వకీల్ సాబ్‌ను మాత్రం దాటలేకపోయింది.
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్ర ట్రైలర్ ఏడు నిమిషాల్లోనే 100K లైకులు సొంతం చేసుకోగా.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మాత్రం ఎనిమిది నిమిషాల్లో ఈ మార్కును చేరుకుంది. దీంతో ఈ రికార్డు పవన్ పేరిటే ఉండిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ 100K లైకుల రికార్డును బ్రేక్ చేయలేకపోయింది కానీ.. 200k లైకులను 18 నిమిషాల్లో.. 300K లైకులను 32 నిమిషాల్లో.. 400K లైకులను 52 నిమిషాల్లో.. 500K లైకులను ఒక గంట ఇరవై నిమిషాల్లో సొంతం చేసుకుంది. 100K మినహా అన్నింట్లోనూ హవా చూపించి రికార్డు క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్ ట్రైలర్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…