ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కొందరు రెండు తలల పాము ఇంట్లో ఉంటే అదృష్టమని, అలాంటి వారికి గుప్త నిధులు దొరుకుతాయని ఓ ముఠా తమ వద్ద ఉన్న ఓ రెండు తలల పామును అమ్మకానికి పెట్టారు.
అయితే విషయం తెలిసిన విజిలెన్స్ అధికారులు డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో దాడిచేసి.. ఈసీఐఎల్ సమీపంలోని నగరంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వి.ఆంజనేయప్రసాద్ అనే ముఠా గ్యాంగ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు తలలు కలిగి 4.30 కేజీల బరువు ఉన్న ఈ పామును ఏకంగా రూ.70 లక్షలకు అమ్మకానికి పెట్టారు.
కాగా నిందితుల నుంచి పోలీసులు కారు, టూవీలర్, 4 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా రెండు తలలు కలిగిన పామును “రెడ్ సాండ్ బోవా” అంటారని దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదం తప్ప ఏ విధమైన అదృష్టం కలగదని అధికారులు తెలియజేశారు. ఈ విధంగా పామును అమ్మకానికి పెట్టిన ముఠాను అరెస్టు చేయడంతో అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ అభినందించారు. కేవలం మూఢ నమ్మకాలను నమ్మే అమాయకులను గుర్తించి కొందరు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…