బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవలే ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ వారు పొరపాటున రూ.5.50 లక్షలను జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే ఒకటి అదే బ్యాంకులో చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా ఇద్దరు పిల్లల ఖాతాల్లో రూ.96 కోట్లు జమ అయ్యాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. సంఘటనపై విచారణ చేపట్టారు.
బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఉన్న బగహురా పంచాయతీ పరిధిలోని పస్తియా అనే గ్రామానికి చెందిన ఆశిష్ కుమార్, గురుచరణ్ బిశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులు 6వ తరగతి చదువుతున్నారు. వారికి ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నాయి. అయితే వారి ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు జమ అయింది.
ఆశిష్ ఖాతాలో రూ.6,20,11,100 జమ కాగా, గురుచరణ్ ఖాతాలో రూ.900,52,21,223 జమ అయ్యాయి. దీంతో వెంటనే పొరపాటును గ్రహించిన బ్యాంకు అధికారులు డబ్బును విత్‌డ్రా చేయకుండా అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. డబ్బులు ఎలా జమ అయ్యాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ బ్యాంకులో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…